Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Theft of Vehicles: వాహనదారులకు అలర్ట్‌.. దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన టాప్ 5 వాహనాలు.. ఈ ప్రాంతంలోనే చోరీలు అధికం

భారతదేశంలో వాహనాలను దొంగిలించడం ఎక్కువైపోయింది. గుట్టుచప్పుడు కాకుండా దొంగలు వాహనాలను చోరీ చేస్తున్నారు. పార్కింగ్‌లో, ఇంటి బయటో, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన బైక్‌లు, కార్లను దొంగలు సునాయాసంగా..

Theft of Vehicles: వాహనదారులకు అలర్ట్‌.. దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన టాప్ 5 వాహనాలు.. ఈ ప్రాంతంలోనే చోరీలు అధికం
Theft Of Vehicles
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2022 | 11:59 AM

భారతదేశంలో వాహనాలను దొంగిలించడం ఎక్కువైపోయింది. గుట్టుచప్పుడు కాకుండా దొంగలు వాహనాలను చోరీ చేస్తున్నారు. పార్కింగ్‌లో, ఇంటి బయటో, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన బైక్‌లు, కార్లను దొంగలు సునాయాసంగా దొంగతనం చేసేస్తున్నారు. ఇలాంటి దొంగల ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ అకో నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాల దొంగతనాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే జరుగుతున్నాయని తెలిపింది. ఇది భారతదేశంలోని వాహన యజమానులకు అత్యంత హాని కలిగించే ప్రాంతంగా మారింది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లు ఉన్నాయి. ఇక బైక్‌ల విషయానికి వస్తే హీరో స్ప్లెండర్‌ను దొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా దొంగిలించబడిన టాప్ 5 కార్లు, బైక్‌ల జాబితా ఈ విధంగా ఉంది. ఇక్కడ వాహనాల దొంగతనం అత్యధికంగా ఉండటం అందరికి ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

అత్యధికంగా దొంగిలించబడిన టాప్ 5 కార్లు ఇవే..

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ శాంత్రో

ఇవి కూడా చదవండి

హోండా సిటీ

హ్యుందాయ్ ఐ10

అత్యధికంగా దొంగిలించబడిన టాప్‌ 5 ద్విచక్ర వాహనాలు:

హీరో స్ప్లెండర్

హోండా యాక్టివా

బజాజ్ పల్సర్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

టీవీఎస్ అపాచీ

ఢిల్లీలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రాంతాలు..

హిణి, భజన్‌పురా, దయాల్‌పూర్ మరియు సుల్తాన్‌పురితో సహా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఉత్తర ప్రాంతాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. జాబితాలో నోయిడాలోని సెక్టార్ 12, పశ్చిమాన ఉత్తమ్ నగర్, గురుగ్రామ్‌లోని సౌత్ సిటీ I కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఎన్‌సిఆర్‌లో ప్రతి 12 నిమిషాలకు ఒక వాహనం దొంగిలించబడుతుంది. ఆ ప్రాంతంలో నివేదించబడిన అన్ని నేరాలలో వాహన దొంగతనం దాదాపు 20% వరకు ఉంటుంది.

సురక్షితమైన ప్రాంతాలు:

ఇక భారతదేశంలో ఎక్కువ దొంగతనాలు జరిగే ఢిల్లీ తర్వాత మరి కొన్ని ప్రాంతాలున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ తర్వాత బెంగళూరు 9 శాతం, చెన్నై 5 శాతం ఉన్నాయి. కాగా, దేశంలోనే అతి తక్కువ వాహనాల దొంగతనాలు జరుగుతున్న నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

దొంగలు అ కలర్ వాహనాలను ఎక్కువ చోరీ చేస్తున్నారు..?

దొంగతనానికి గురైన వాహనాల రంగు విషయానికొస్తే.. తెల్లటి కార్లు ఎక్కువగా దొంగతనానికి గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే దొంగతనం చేసిన తెలుపు వాహనం ట్రాఫిక్‌లో ఉండే వాహనాల్లో కలిసిపోతుంది. చోరీ అయిన వాహనం త్వరగా గుర్తించలేరు. అంతేకాకుండా తెల్లటి కార్లను వేరే రంగులో పెయింట్ చేయడం సులభం.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ను భారతదేశానికి వాహన దొంగతనాల రాజధానిగా మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికీ, భవనాలు, కాలనీలలో పార్కింగ్ స్థలం లేకపోవడం, వాహనాలను రోడ్లపై పార్క్ చేయడం వంటి కారణాలున్నాయంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి