PM Kisan: ఈ ఒక్క పొరపాటు వల్ల 4 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందలేకపోయారు..!
దేశ రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000..
దేశ రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందుకుంటున్నారు. అయితే సాయాన్ని మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. అక్టోబర్ 17 సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడతను ప్రధాని నరేంద్ర మోడీ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడుసార్లు వచ్చే ఈ మొత్తం రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. సోమవారం 12వ విడతగా 16 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ బదిలీ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. కానీ సకాలంలో ఈ-కేవైసీ పూర్తి కాకపోవడంతో కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరలేదు. నివేదికల ప్రకారం.. దాదాపు 2.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయల పడలేదు. అదే 11వ విడతగా 21 వేల కోట్లకు పైగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేసింది.
12వ విడతగా 16 వేల కోట్లు విడుదల చేయగా,11వ విడత కంటే 12వ విడతలో 5 వేల కోట్ల రూపాయలు తక్కువగా బదిలీ చేశారు. అంటే ఈసారి 2.50 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి వాయిదాలు బదిలీ చేయలేదు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో 12 కోట్ల మందికి పైగా రైతుల రిజిస్ట్రేషన్ ఉందని, 16 వేల కోట్లు అంటే ఎనిమిది కోట్ల మంది రైతులకు మాత్రమే డబ్బు వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు కోట్ల మంది రైతులకు ఈసారి వాయిదా డబ్బులు రాలేదని అర్థమవుతోంది. పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం.. ప్రతి సంవత్సరం 5% మంది లబ్ధిదారుల భౌతిక ధృవీకరణ జరుగుతుంది. ఏప్రిల్ నుంచి జులై వరకు విడుదల చేయాల్సిన 11వ విడత మొత్తం ఇప్పటి వరకు 11.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు జమ అయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి