వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. తక్కువ డిటర్జెంట్‌లో మీ బట్టలు మెరుస్తాయి..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 18, 2022 | 6:32 PM

చాలా సార్లు వాషింగ్ మెషీన్ సరిగ్గా ఉపయోగించకపోతే, బట్టలు మురికిగా ఉంటాయి. లేదంటే..బట్టలపై అక్కడక్కడ డిటర్జెంట్ అంటుకుని కనిపిస్తుంది.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. తక్కువ డిటర్జెంట్‌లో మీ బట్టలు మెరుస్తాయి..
Washing Machine Tips

ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషీన్ ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు తక్కువ డిటర్జెంట్, తక్కువ నీటిలో బట్టలు మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. కానీ, చాలా సార్లు వాషింగ్ మెషీన్ సరిగ్గా ఉపయోగించకపోతే, బట్టలు మురికిగా ఉంటాయి. లేదంటే..బట్టలపై అక్కడక్కడ డిటర్జెంట్ అంటుకుని కనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే మేము మీకు కొన్ని చిట్కాలను చెబుతున్నాము.. వీటిని అనుసరించడం ద్వారా మీరు మీ బట్టలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.

తరచుగా లాండ్రీ బ్యాగ్‌లో ఉంచిన బట్టలు ఉతకడానికి మెషిన్‌లో అన్ని కలిపి వేస్తారు. కానీ, మీకు తెలుసా..? వివిధ బట్టలు కలిపి ఉతకడం వల్ల చాలా సార్లు బట్టలు మురికిగా ఉంటాయి. గట్టి బట్టలతో మృదువైన బట్టలు ఉతకడం వల్ల అవి పాడైపోయే ప్రమాదం ఉంది. పైగా చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మందమైన బట్టలు ఎక్కువసేపు ఉతకవలసి ఉంటుంది. అయితే మృదువైన బట్టలు త్వరగా ఉతకాలి.

ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు బట్టల ప్రకారం వేర్వేరు ప్రోగ్రామ్‌లను కలిగి ఉంటాయి. కానీ, తప్పు ప్రోగ్రామ్‌ను ఎంచుకోవడం వలన కొన్నిసార్లు బట్టలు శుభ్రంకావు. అందువల్ల, బట్టల తీరుకు అనుగుణంగా మెషీన్‌ ప్రొగ్రామ్‌ని మార్చండి. దీని కారణంగా డిటర్జెంట్ కూడా తక్కువగా అవసరం అవుతుంది. నీరు కూడా తక్కువగా తీసుకుంటుంది.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఎక్కువ మురికి బట్టలు విడిగా, తక్కువ మురికి బట్టలు విడిగా ఉతకాలని గుర్తుంచుకోండి. తక్కువ మాసిన బట్టలు ఉతకడానికి తక్కువ సమయం, తక్కువ నీరు పడుతుంది. కాబట్టి మెషీన్‌ తక్కువ సమయాన్ని కేటాయించండి. అదే సమయంలో ఎక్కువ మురికి బట్టలు ఎక్కువ టైమ్‌త పాటు ఎక్కువ మెషీన్‌ తిప్పడం అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu