బైక్ స్పీడోమీటర్‌లో నల్లటి నాగుపాము ప్రత్యక్షం .. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..!
తెల్లవారగానే ఏదో పనిమీద బైక్‌పై బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లగానే బైక్‌లో నుంచి పాము బుసకొడుతున్న శబ్దం వచ్చింది. దీంతో నజిర్.. బైక్‌ను పక్కకు ఆపి పరిశీలించగా..
పాము పేరు వింటే చాలు.. చాలా మందికి గుండెలు గుభేల్ మంటాయి. భయంతో అక్కడ్నుంచి ఉన్నపళంగా పరిగెడతారు. ఇకపోతే, పాములు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయో కూడా ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు, వరదల కారణంగా బొరికెలు, పొదల్లో ఉన్న పాములు జనావాసాల్లోకి వచ్చి హల్‌చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పాములు ఏ చిన్నపాటి సందు దొరికినా సరే అందులో దూరిపోతుంటాయి. చాలా సార్లు ఇంట్లోని ఫ్రీజ్‌లో, ఎయిర్ కూలర్‌లో కూడా పాములు ప్రవేశించిన వార్తలు చూశాం. ఇకపోతే, కాళ్లకు వేసుకునే షుస్‌లో కూడా పాములు దూరి భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కార్లు, బైకుల్లోనూ పాములు ప్రవేశిస్తుంటాయి. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో బైక్ స్పీడోమీటర్‌లో దూరి కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్‌కు చెందిన నజిర్‌ఖాన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేశాడు. తెల్లవారగానే ఏదో పనిమీద బైక్‌పై బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లగానే బైక్‌లో నుంచి పాము బుసకొడుతున్న శబ్దం వచ్చింది. దీంతో నజిర్.. బైక్‌ను పక్కకు ఆపి పరిశీలించగా స్పీడోమీటర్‌లో నల్లటి నాగు పాము కనిపించింది.
: नरसिंहपुर में मोटरसाइकिल के मीटर में घुसा सांप pic.twitter.com/W8Dcu6fzoG
— NaiDunia (@Nai_Dunia) October 17, 2022
బైక్‌లోకి పాము ఎలా వచ్చిందో అర్థంకాకా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా..అక్కడంతా స్థానికులు గుమిగూడారు. పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలు శ్రమించి స్పీడోమీటర్ అద్దం పగలగొట్టి పామును బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి