రూ.300ల కోసం బంధువుల మధ్య గొడవ.. మద్యం మత్తులో జరిగిన ఘర్షణతో ఏం జరిగిందంటే..

వాజీద్, కరీం ఇద్దరూ బంధువులు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఎక్కువగా ఉండేది. కానీ, గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య డబ్బు విషయంలో విరోధం ఉంది. గతంలో కూడా

రూ.300ల కోసం బంధువుల మధ్య గొడవ.. మద్యం మత్తులో జరిగిన ఘర్షణతో ఏం జరిగిందంటే..
Kalaburagi
Follow us

|

Updated on: Oct 18, 2022 | 4:47 PM

మద్యం మత్తు ఎంతటి దారుణాలకు దారితీస్తుందో తెలిపే మరో సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కేవలం..రూ.300 కోసం బంధువుల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే వారి బంధువు యువకుడిని పొడిచి చంపేశాడు. కుటుంబానికి ఆధారమైన కొడుకును కోల్పోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు కుదేలైంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేని స్థితిలోకి కుటుంబ సభ్యులను పడేసింది. మరోవైపు, జనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఘటనతో అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. జరిగిన హత్యా ఘటనతో స్థానిక వ్యాపారులు సైతం షాక్‌కు గురయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలోని అలంద్‌ పట్టణంలో గత ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన యువకుడి పేరు కరీం బగ్వాన్‌గా తెలిసింది. 25 ఏళ్ల కరీమ్‌ బగ్వాన్‌.. వివాహం చేసుకుని అలంద్ పట్టణంలోని రేవణసిద్దేశ్వర్ కాలనీలో నివసిస్తున్నాడు. అలంద పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా పళ్ల వ్యాపారం చేస్తుంటాడు. బస్టాండ్ ముందు పండ్లు అమ్ముకుని జీవనం సాగించే కరీం రోజూ మాదిరిగానే తెల్లవారుజామున వ్యాపారం పేరుతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే నిన్న రాత్రి అలంద బస్టాండ్ ఎదుట ఓ దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అతనికి సహాయం చేసేందుకు వెళ్లిన కరీం సోదరుడిపై కూడా దుండగుడు దాడి చేశాడు. కరీం మెడపైనా, పొట్టపైనా పొడిచి చంపడంతో కరీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కరీం బగ్వాన్‌ను హత్య చేసింది వాజీద్ అనే వ్యక్తిగా గుర్తించారు. కరీం సోదరుడి బంధువు వాజీద్‌..ఇతడు కూడా అలంద్ పట్టణంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. . వాజీద్, కరీం ఇద్దరూ బంధువులు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఎక్కువగా ఉండేది. కానీ, గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య డబ్బు విషయంలో విరోధం ఉంది. గతంలో కూడా కరీమ్‌తో వాజీద్‌ గొడవ పడినట్లు తెలుస్తోంది. అయితే నిన్న మళ్లీ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలోనే ఇద్దరూ తాగి వచ్చి 300 రూపాయల కోసం గొడవ పడ్డారు. కొద్ది రోజుల క్రితం వాజీద్ కరీం బగవాన్‌కు రూ.300 చెల్లించినట్లు సమాచారం. అదే డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలై కరీం హత్యకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కరీం బగ్వాన్ హత్యకు సంబంధించి అలంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఇప్పటికే వాజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వాజీద్ మాత్రమే హత్యలో పాల్గొన్నాడా? ఇంకా మరెవరైనా ఉన్నారా? హత్యకు అసలు కారణం ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే చిన్న కారణానికి బంధువులు గొడవపడి ఒకరిని హత్య చేయడం దురదృష్టకరం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి