PM Modi: ఉగ్రవాదం, డ్రగ్స్, అవినీతిపై ఐకమత్యంగా ఉద్యమించాలి.. ఇంటర్‌పోల్ సదస్సులో ప్రపంచదేశాలకు ప్రధాని మోదీ పిలుపు
ఢిల్లీలో ప్రారంభమైన ఇంటర్‌పోల్ 90వ సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. స్థానిక ప్రయోజనాల కోసం ప్రపంచ సహకారం ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు.

మెరుగైన ప్రపంచానికి అంతర్జాతీయ సహకారం అవసరమని, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రపంచం ఏకం కావాలని, తద్వారా వారికి సురక్షితమైన స్వర్గధామం లేదని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం (అక్టోబర్ 18) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇంటర్‌పోల్ 90వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. 195 దేశాల నుంచి ఇంటర్‌పోల్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రగతి మైదాన్‌లో ఇంటర్‌పోల్ సమావేశాలను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. ఈ వార్షిక సమావేశాల్లో 195 దేశాల నుంచి ఇంటర్‌పోల్ సభ్యులు పాల్గొన్నారు. పాకిస్థాన్ కూడా ఇద్దరు సభ్యులను ఈ సమావేశాలకు పంపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా ఈ సమావేశానికి పాక్ ప్రతినిధులు హాజరయ్యారు. 1997లో కూడా ఒకసారి భారత్‌లో ఇంటర్‌పోల్ సమావేశం జరిగింది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్‌లో పిల్లలపై అఘాయిత్యాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇంటర్‌పోల్ చీఫ్ జుర్గెన్ స్టాక్ అన్నారు. ఇలాంటి నేరాలు చాలా వరకు ఫిర్యాదుల వరకు వెళ్లడంలేదన్నారు . ఇంటర్‌పోల్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, డ్రగ్స్ , మనుషుల అక్రమ రవాణా లాంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటుందని అన్నారు మోదీ . ఈ సవాళ్లను ప్రపంచం ఐకమత్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు . లేదంటే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు.
Safe, secure world is shared responsibility: PM Modi at 90th Interpol meet
Read @ANI Story | https://t.co/gwGrzQm8LS#PMModi #Interpol pic.twitter.com/8MZpqcofLD
— ANI Digital (@ani_digital) October 18, 2022
ప్రపంచవ్యాప్తంగా ముప్పు ఉన్నప్పుడు..
స్థానిక ప్రయోజనాల కోసం ప్రపంచ సహకారానికి పిలుపునిచ్చామని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. దేశంలో బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నపుడు స్థానికంగా స్పందించలేమని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం, అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, ఈ బెదిరింపులు గతంలో కంటే వేగంగా మారుతున్నాయన్నారు.
శాంతి పరిరక్షణలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌కు ధైర్యవంతులను పంపడంలో భారతదేశం అగ్రగామిగా ఉందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా ప్రపంచాన్ని బాగు చేసేందుకు త్యాగాలు చేశామని గుర్తు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




