Black Magic: అర్థరాత్రి గది నుంచి బాలిక అరుపులు.. దెయ్యం వదిలించానన్న దొంగ బాబా.. తెల్లారి షాకింగ్ న్యూస్..
చేసింది పెద్ద నేరం.. పైగా దానిని కవర్ చేసుకోవడానికి దెయ్యం, దేవతలు అని పేరు పెట్టే ప్రయత్నం చేశాడో కీచకుడు. అవును అబంశుబం తెలియన ఓ మైనర్ బాలికపై అత్యాచారం..

చేసింది పెద్ద నేరం.. పైగా దానిని కవర్ చేసుకోవడానికి దెయ్యం, దేవతలు అని పేరు పెట్టే ప్రయత్నం చేశాడో కీచకుడు. అవును అబంశుబం తెలియన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దొంగ బాబా.. ఆపై అమ్మాయికి దెయ్యం వదిలించానంటూ ఆమె కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పాడు. అయితే, బాలిక జరిగిన విషయం చెప్పడంలో సీన్ రివర్స్ అయ్యింది. బాలిక చెప్పిన విషయం విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కీచక బాబాపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో తాంత్రికుడి హేయమైన చర్య బట్టబయలైంది. ఓ తాంత్రికుడి వద్దకు వచ్చిన కుటుంబాన్ని భూతం పట్టిందని, వదిలిస్తాని నమ్మబలికాడు. ఇలా దెయ్యం పేరుతో మైనర్ బాలికపై కన్నేశాడు ఆ తాంత్రికుడు. అది తెలియని ఆ కుటుంబ సభ్యులు.. తమ బిడ్డకు దెయ్యం పట్టిందని, అతను వదిలిస్తాడని నమ్మి.. తాంత్రికుడి వద్ద వదిలేశారు. అలా కుటుంబ సభ్యులను ఏమార్చిన తాంత్రికుడు.. బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బయటకు వచ్చాక.. వారి కూతురుకు దెయ్యం వదిలిందని, తీసుకుపోవచ్చని చెప్పాడు. అనంతరం వారి నుంచి ఫీజు కూడా వసూలు చేశాడు. ఆ డబ్బును తీసుకున్న వెంటనే అతను అక్కడి నుంచి ఉడాయించాడు.
ఇక బాలిక మత్తు నుంచి తేరుకున్న తరువాత కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది. షాక్ అయిన బాధిత కుటుంబం.. వెంటనే అజ్మీర్‌లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన తాంత్రికుడు అనిల్ శర్మను అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణలో అతని నుంచి షాకింగ్ వివరాలు రాబట్టారు పోలీసులు. ప్రజల్లో మూఢనమ్మకాలను వ్యాపింపజేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని వెల్లడించారు. అంతేకాదు.. గత నెలలో కూడా ఓ కుటుంబాన్ని ఇలాగే మోసం చేశాడని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




