AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agra: క్షణాల్లో దారుణం.. వ్యక్తి ప్రాణం తీసిన ఆ ‘ఒక్క మాట’.. వైద్యులు సైతం అలా అనడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. నిండు ప్రాణం బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. మందు తాగొద్దని చెప్పడమే బాధిత వ్యక్తం చేసిన తప్పు. అలా చెప్పినందుకు..

Agra: క్షణాల్లో దారుణం.. వ్యక్తి ప్రాణం తీసిన ఆ ‘ఒక్క మాట’.. వైద్యులు సైతం అలా అనడంతో..
Vegetable Seller
Shiva Prajapati
|

Updated on: Oct 18, 2022 | 6:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. నిండు ప్రాణం బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. మందు తాగొద్దని చెప్పడమే బాధిత వ్యక్తం చేసిన తప్పు. అలా చెప్పినందుకు ఆగ్రహించిన దుండగులు.. కత్తితో గుండెల్లో పోటు పొడిచాడు. కత్తి వేటు తీవ్రంగా గాయపడిన బాధితుడు.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్రాలోని ఎత్మద్ – ఉద్-దౌల పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ సయీద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రవి కుమార్(32) అనే వ్యక్తి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనోజ్ దివాకర్(28) వీధి రౌడి.. మరో నలుగురు స్నేహితులను వెంటపెట్టుకుని కారులో వచ్చాడు. దుకాణదారుల నుంచి వసూళ్లు చేసే దివాకర్.. కూరగాయల వ్యాపారి అయిన రవికుమార్ వద్దకు వచ్చాడు. గుట్కా ఇవ్వాలని అడగగా.. లేదని సమాధానం చెప్పాడు రవి. దాంతో ఆగ్రహానికి గురైన దివాకర్.. ఈ ప్రాంతంలో కూరగాయలు అమ్మలేవని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చాడు.

ఆ తరువాత దివాకర్ తన కారు వద్దకు వెళ్లి రోడ్డుపైనే కూరగాయల కొట్టు ముందు మద్యం సేవిస్తున్నాడు. అది గమనించిన రవి.. అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక్కడ మద్యం తాగొద్దని కోరాడు. తన గిరాకీ పోతదని, మద్యం వేరే చోట తాగాలిన కోరాడు. దాంతో దివాకర్ వెళ్లినట్లే వెళ్లి.. తన స్నేహితులతో కలిసి మళ్లీ వచ్చాడు. రవితో గొడవకు దిగాడు. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవగా.. ఆగ్రహానికి గురైన దివాకర్ తన కారులోని కత్తి తీసుకువచ్చి రవి కుమార్ చాతిలో పొడిచాడు. వెంటనే కుప్పకూలిపోయాడు రవి.

ఇవి కూడా చదవండి

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవి ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇక్కడా వారికి పెద్ద సమస్య తలెత్తింది. చాలా ఆస్పత్రులకు తిప్పినా.. చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఆ తరువాత ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మనోజ్ దివాకర్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్