AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: రూ.3,999 విలువైన స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 999కే.. అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్‌

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ప్రతి కేటగిరీ ఉత్పత్తులను బంపర్ డిస్కౌంట్‌లతో విక్రయిస్తున్నారు. మనం రోజూ ఉపయోగించే గాడ్జెట్‌లపై మంచి ఆఫర్లు..

Amazon Sale: రూ.3,999 విలువైన స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 999కే.. అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్‌
Smartwatch
Subhash Goud
|

Updated on: Oct 18, 2022 | 10:45 AM

Share

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ప్రతి కేటగిరీ ఉత్పత్తులను బంపర్ డిస్కౌంట్‌లతో విక్రయిస్తున్నారు. మనం రోజూ ఉపయోగించే గాడ్జెట్‌లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, బట్టలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ఇతర ప్రోడక్ట్స్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది.

రెడ్‌మి పవర్ బ్యాంక్: ఈ రెడ్‌మి పవర్ బ్యాంక్ కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. 10000 mAh సామర్థ్య ఉన్న పవర్‌ బ్యాంకును తక్కువ ధరల్లో పొందవచ్చు. ఇది 2 USB పోర్ట్‌లు కలిగి ఉంటుంది. ఇవి 10 W వరకు వేగంగా ఛార్జ్ చేయగలవు. రెండు పోర్ట్‌లలో ఒక పోర్ట్ మైక్రో-యుఎస్‌బితో వస్తుంది. మరొక పోర్ట్ టైప్-సితో వస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.949కి పొందవచ్చు.

పోర్ట్రోనిక్స్ రైటింగ్ ప్యాడ్: ఈ రైటింగ్ ట్యాబ్‌లో 12-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది రేడియేషన్ లేనిది. తక్కువ బరువుతో వస్తున్న ఈ టాబ్లెట్ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఈ ట్యాబ్ సహాయంతో ముఖ్యమైన రిమైండర్‌లు, నోట్స్ మొదలైనవాటిని రాసుకోవచ్చు. తగ్గింపు తర్వాత ఈ ట్యాబ్‌ను రూ.459కి విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

boAt Airdopes 121v2 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్: బోట్ బ్రాండ్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరల్లో పొందవచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కూడిన ఈ బడ్‌లు గరిష్టంగా 14 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తాయి. ప్రతి ఛార్జ్‌పై బడ్స్ 3.5 గంటల పాటు ప్లే అవుతాయి. తక్కువ ధరలో అత్యుత్తమ సౌండ్ కోసం 8mm డ్రైవర్లు అందించబడ్డాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5 సపోర్ట్ ఉంది. 67 శాతం తగ్గింపు తర్వాత ఈ బడ్స్‌ను రూ. 999కి కొనుగోలు చేయవచ్చు.

Zebronics SmartWatch(ZEB-FIT280CH): ఈ వాచ్‌కు IP68 రేటింగ్ ఉంది. ఇది స్ప్లాష్ రెసిస్టెంట్‌గా చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో కస్టమర్‌లు కాల్ రిజెక్ట్, 12 స్పోర్ట్స్ మోడ్‌లను పొందుతారు. దీనితో పాటు హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్, బీపీ మానిటర్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. దీని అసలు ధర రూ.3,999 ఉండగా, 75 శాతం తగ్గింపు తర్వాత ఈ వాచ్ రూ. 999కే వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి