Investment Plans: ఈ పథకాల్లో పెట్టుబడి భవిష్యత్‌లో బంగారు రాబడి.. మహిళల కోసం ప్రత్యేకం..
ముఖ్యంగా ప్రతి స్త్రీ ఓ ఆర్థిక వేత్తలానే ఇంటి ఖర్చులను మెయిన్‌టెయిన్ చేస్తుంది. భర్తకు తెలియకుండా పోపుల డబ్బాలో డబ్బు దాచి పిల్లల అవసరాల తీర్చే తల్లులు చాలా మంది ఉంటారు.

పాలిచ్చే అమ్మకు పాలించడం తెలియదా? ఇది అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్.. కేవలం పాలించడం అంటే రాజకీయ పదవులు కాదు ఇంటి భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకుని ప్రతి స్త్రీ పొదుపు చేసుకుంటుంది. ముఖ్యంగా ప్రతి స్త్రీ ఓ ఆర్థిక వేత్తలానే ఇంటి ఖర్చులను మెయిన్‌టెయిన్ చేస్తుంది. భర్తకు తెలియకుండా పోపుల డబ్బాలో డబ్బు దాచి పిల్లల అవసరాల తీర్చే తల్లులు చాలా మంది ఉంటారు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఇది స్త్రీత్వం, కృషి, గౌరవం, స్త్రీల విజయాలను గుర్త చేసుకుంటూ వారిని సత్కరించే రోజు. మహిళలే అత్యుత్తమ పెట్టుబడిదారులని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. ముఖ్యంగా స్త్రీలు పెట్టుబడి పెట్టే కొన్ని సాధనాల గురించి తెలుసుకుందాం.
సావరిన్ గోల్డ్ బాండ్స్
సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. గోల్డ్ బాండ్‌లు కూడా భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఎస్‌జీబీ బాండ్‌లు 999 స్వచ్ఛతకు ఉంటుంది. ఈ బాండ్లను బ్యాంకులు, పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు అంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీఎస్ఈ ద్వారా విక్రయిస్తారు. ఈ బాండ్ కాలవ్యవధి 8 సంవత్సరాల కాలవ్యవధితో పాటు 5వ సంవత్సరం తర్వాత నిష్క్రమణ ఎంపికతో తదుపరి వడ్డీ చెల్లింపు తేదీల్లో అమలు చేయబడుతుంది. మెచ్యూరిటీ వరకు ప్రభుత్వం సంవత్సరానికి 2.50 శాతం రాబడిని కూడా అందిస్తుంది.
జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్)
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) అనేది ప్రభుత్వం తిరిగి ఇచ్చే పెట్టుబడి పెన్షన్ పథకం. ఎన్‌పీఎస్తో, పదవీ విరమణ పొదుపులకు స్వచ్ఛందంగా పెట్టుబడివ పెట్టవచ్చు. ఎన్‌పీఎస్ కింద ఒకరు రెండు రకాల ఖాతాలను తెరవవచ్చు. టైర్ 1 ఖాతా, టైర్ 2 ఖాతా. ఈ పథకం భారతదేశంలోని ప్రతి పౌరునికి తగిన పదవీ విరమణ ఆదాయాన్ని అందిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రయోజనం అందిస్తుంది. ఎస్ఐపీగా పెట్టుబడి పెట్టడానికి కేవలం రూ. 100తో ఇన్వెస్ట్ చేయడంతో ప్రారంభించవచ్చు. మీరు దీర్ఘకాలిక దృక్పథంతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అనేది ఎలాంటి భౌతిక రూపం లేదా సర్టిఫికేట్ లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడం. దీని తీసుకోవాలంటే పెట్టుబడిదారులకు డీమ్యాట్ ఖాతాను కావాలి. దీంతో పాటు డీమెటీరియలైజ్డ్ రూపంలో బంగారు యూనిట్లను కలిగి ఉండాలి. ఈటీఎఫ్‌లను మార్కెట్ ధరలకు నిరంతరం కొనుగోలు చేయడంతో పాటు వాటిని విక్రయించవచ్చు. మీకు కావలసినప్పుడు మీరు గోల్డ్ ఈటీఎఫ్ నుంచి నిష్క్రమించవచ్చు. దీనికి ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



