Komaki LY Pro: కిర్రాక్ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్.. పెట్రోల్ బైక్‪కి ఏమాత్రం తీసుపోని ఎలక్ట్రిక్ స్కూటర్..

కోమకి ఈవీ స్టార్టప్ కంపెనీ కోమకి ఎల్‪వై ప్రో(Komaki LY Pro)ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పనితీరు, భద్రత పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన లాంగ్ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Komaki LY Pro: కిర్రాక్ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్.. పెట్రోల్ బైక్‪కి ఏమాత్రం తీసుపోని ఎలక్ట్రిక్ స్కూటర్..
Komaki Ly Pro
Follow us

|

Updated on: Mar 15, 2023 | 2:03 PM

ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ముఖ్యంగా లోకల్ అవసరాలకు అందరూ దీనిని ఎంచుకుంటున్నారు. దీనికి అనుగుణంగా దిగ్గజ కంపెనీలతో పాటు పలు స్టార్టప్ లు కూడా విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే కోవలో కోమకి ఈవీ స్టార్టప్ కంపెనీ కోమకి ఎల్‪వై ప్రో(Komaki LY Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పనితీరు, భద్రత పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన లాంగ్ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అని కోమకి కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ ప్యాక్ ఇలా..

కోమకి ఎల్‪వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 62V, 32Ah కెపాసిటీ గల లిథియం అయాన్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది స్వాపబుల్ బ్యాటరీ. దీనిని ప్యాక్ నుంచి తొలగించి బయట చార్జ్ చేసుకోవచ్చు. దీనికి 3000W పవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ హబ్ మోటార్ జోడించబడింది. ఛార్జింగ్‌కు సంబంధించి, ఈ బ్యాటరీ ప్యాక్ సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు 4 గంటల 55 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

టాప్ స్పీడ్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే, సింగిల్ బ్యాటరీ వేరియంట్ గంటకు 58 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 80 నుండి 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 62 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తే సింగిల్ చార్జ్ పై 160 నుండి 180 కిమీల పరిధిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్రేకింగ్, సస్పెన్షన్ సిస్టమ్..

కోమకి ఎల్‪వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ముందు, వెనుక చక్రాల వద్ద డిస్క్ బ్రేక్‌లతో వస్తోంది. సస్పెన్షన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్స్ సస్పెన్షన్ ఉంటుంది. వెనుక భాగంలో స్ప్రింగ్ ఆధారిత షాక్ అబ్జార్బర్‌లు వ్యవస్థను అమర్చారు. అంతే కాకుండా జారే రోడ్లపై సాఫీగా ప్రయాణించేందుకు ఈ స్కూటర్‌లో యాంటీ స్కిడ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. బైక్‌లో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉన్నాయి.

ఫీచర్లు ఇలా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అద్భుతమైన డిజైన్‌తో పాటు ఆకర్షణీయ ఫీచర్లతో తీర్చిదిద్దారు. టీఎఫ్‌టీ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలింగ్ ఆప్షన్, సౌండ్ సిస్టమ్, నావిగేషన్, మూడు రైడింగ్ మోడ్‌లు (ఎకో, స్పోర్ట్స్, టర్బో) వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, ఏఎంపీ కంట్రోలర్, ఎల్ఈడీ ఫ్రంట్ వింకర్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జోడించారు.

నాణ్యత, అధిక పనితీరు..

కోమకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘మేము అధిక నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన, దృఢమైన డిజైన్, తక్కువ మెయింటెనెన్స్, లాంగ్ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. కోమకి ఎల్ వై ప్రో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణించగలదు. ఇది సంప్రదాయ ఇంధన బైక్ ల వంటి పనితీరుని కనబరుస్తుంది.’ అని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..