Upcoming car: ఆ మూడు టాప్ కంపెనీల నుంచి బెస్ట్ కార్లు ఇవే.. త్వరలో మార్కెట్లోకి.. పూర్తి వివరాలు తెలుసుకోండి

మన దేశంలో ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా కూడా కొత్త కాంపాక్ట్ కార్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలో ఈ మూడు కంపెనీల నుంచి ఈ నెలలో రానున్న కొత్త మోడళ్లను ఇప్పుడు చూద్దాం..

Upcoming car: ఆ మూడు టాప్ కంపెనీల నుంచి బెస్ట్ కార్లు ఇవే.. త్వరలో మార్కెట్లోకి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Tata Punch Ev
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2023 | 5:00 AM

మన దేశంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మధ్య తరగతి వారు కూడా కనీసం ఒక చిన్న కారు కలిగి ఉండాలని కోరుకొంటున్నారు. దీంతో 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశంలో మొత్తం 9,94,000 యూనిట్ల చిన్న కార్లు అమ్ముడయ్యాయి.ఈ సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 1.37 మిలియన్ యూనిట్లకు పెరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకునేందుకు అన్ని దిగ్గజ కార్ల కంపెనీలు ప్రణాళిక రచిస్తున్నాయి. మన దేశంలో ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా కూడా కొత్త కాంపాక్ట్ కార్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలో ఈ మూడు కంపెనీల నుంచి ఈ నెలలో రానున్న కొత్త మోడళ్లను ఇప్పుడు చూద్దాం..

మారుతి ఫ్రాంక్స్..

2023 ఏప్రిల్ మొదటి వారంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్సా షోరూమ్ లలో ఇది అందుబాటులో ఉండనుంది. దీనిలో 1.0L టర్బో పెట్రోల్ లేదా 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ 100bhp, 147.6Nm టార్క్ ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ మోటార్ 90bhp, 113Nm టార్క్ ను అందిస్తుంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండూ అందుబాటులో ఉంటాయి. మారుతి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా ఆల్ఫా ట్రిమ్‌లలో వస్తోంది. దీనిలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఒక హెచ్యూడీ, ఆటోమేటిక్ ఏసీ యూనిట్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఏఐ3

కొన్ని నివేదికల ప్రకారం, హ్యుందాయ్ హ్యుందాయ్ Ai3 అనే కోడ్‌నేమ్‌తో కొత్త మైక్రో ఎస్యూవీని పరీక్షిస్తోంది. ఈ వాహనం పొడవు 3.8 మీటర్లు ఉంటుందని అంచనా. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ నుంచి 1.2L పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండవచ్చు. 83bhp, 113.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ శ్రేణిలో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ..

2023 ఆటో ఎక్స్‌పోలో, టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్, సీఎన్జీ వెర్షన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఈ రెండూ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి. ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్‌లో వస్తున్న కారులో సీఎన్జీ కిట్‌తో పాటు 1.2L పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది, ఇది గరిష్టంగా 77PS పవర్ అవుట్‌పుట్, 95Nm టార్క్‌ను అందిస్తుంది. మరోవైపు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్ట్రోజ్ ​​రేసర్ ఎడిషన్ మరింత శక్తివంతమైన 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది, ఇది 120PS వరకు శక్తిని, 170Nm టార్క్‌ను అందిస్తుంది. దీని ఫీచర్లు చాలా వరకు సాధారణ ఆల్ట్రోజ్‌ని పోలి ఉంటాయి.

టాటా పంచ్ ఈవీ..

కొన్ని నివేదికల ప్రకారం, టాటా పంచ్ ఈవీ 2023 పండుగ సీజన్‌లో మార్కెట్లోకి రానుంది. రాబోయే ఎలక్ట్రిక్ మినీ ఎస్యూవీ కొత్త సిగ్మా ప్లాట్‌ఫారమ్ (Gen 2)పై ఆధారపడి ఉంటుంది. టాటా జిప్‌ట్రాన్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటుంది, శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది. వాటి సామర్థ్యాలు 26kWh, 30.2kWh గా ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ సీఎన్జీ పవర్‌ట్రైన్ సెటప్ 1.2L రెవోట్రాన్ ఇంజన్, సీఎన్జీ కిట్‌ను కలిగి ఉంటుంది. సీఎన్జీతో నడుస్తున్నప్పుడు 70-75bhp పవర్ అవుట్‌పుట్, 100Nm టార్క్‌ను అందిస్తుంది, దీని మైలేజ్ సుమారుగా 30km/kg ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 13వేలలో 5జీ ఫోన్‌.. ఊహకందని ఫీచర్లు..
రూ. 13వేలలో 5జీ ఫోన్‌.. ఊహకందని ఫీచర్లు..
సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..
సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..