IPL 2023: ఆర్సీబీ థీమ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. కేవలం రూ. 499తోనే బుక్ చేసుకోండి.. ఫ్యాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు..
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధికారిక ఈవీ భాగస్వామి అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆంపియర్ ప్రైమస్ ను ఆర్సీబీ థీమ్ తో విడుదల చేసింది. దీనిపై బుకింగ్స్ సైతం ప్రారంభించింది. కేవలం రూ. 499 తో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

మన దేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. ప్రజలు అమితంగా ఈ క్రీడను ఇష్టపడతారు. క్రికెటర్లను ఆరాధిస్తారు. తమ ఆరాధ్య క్రికెటర్లు బాగా ఆడాలని, తమ జట్టును గెలిపించాలని ప్రార్థిస్తూ ఉంటారు. అది దేశం తరఫునా అయినా, లేదా ఐపీఎల్ వంటి రిచ్ క్యాష్ లీగ్ పోటీలైనా సరే. రెండు రోజుల కిందట డొమెస్టిక్ టీ20 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16 సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ అంటే కేవలం మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా విశేష ఆదరణ ఉంది. ప్రపంచ స్థాయి మేటి క్రికెటర్లు ఇందులో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. ఇదే క్రమంలో మొత్తం ఐపీఎల్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించే ఈజట్టు ఏటా ‘ఈ సారి కప్ మనదే’ అనే స్లోగన్ తో బరిలోకి దిగినా.. ఇప్పటి వరకూ ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. అయితే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి, తొలి మ్యాచ్ లో ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబైని మట్టికరిపించింది. ఈ క్రమంలో ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధికారిక ఈవీ భాగస్వామి అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆంపియర్ ప్రైమస్ ను ఆర్సీబీ థీమ్ తో విడుదల చేసింది. దీనిపై బుకింగ్స్ సైతం ప్రారంభించింది. కేవలం రూ. 499 తో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ కి అవార్డు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ గ్రౌండ్ లో ఆడే ప్రతి మ్యాచ్ లోనూ మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ ఆర్సీబీ ప్లేయర్ అవార్డును ఇవ్వనున్నారు. ఈ మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ ఆర్సీబీ ప్లేయర్ ఆంపియర్ ప్రైమస్ స్కూటర్‌ను అవార్డుగా అందిస్తారు. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకొనే ఆర్సీబీ ఫ్యాన్స్ ఏప్రిల్ మొదటి వారంలో రూ. 499 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది మన దేశంలోని ఇంటి అవరాలకు బాగా ఉపయోగపడుతుంది. సిటీ పరిధిలో ఇంటి అవసరతలను తీర్చేందుకు బాగా ఉపకరిస్తుంది.
జట్టులో స్ఫూర్తి నిపేందుకే..
ఈ సందర్భంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజ్ బెహ్ల మాట్లాడుతూ ఆర్సీబీ థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడానికి ప్రధాన కారణం జట్టులో స్పూర్తిని నింపడంతో పాటు క్రీడను మరింత ప్రోత్సహించడమే నని చెప్పారు. అయితే ఇది పరిమిత కాలం వరకూ అందుబాటులో ఉంటుంది. ఆర్సీబీ ఫ్యాన్ త్వరపడాలి చెప్పాలి.



ఆంపియర్ ప్రైమస్ ఫీచర్లు ఇవి..
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో కంపెనీ 3 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ విత్ స్మార్ట్ బీఎంఎస్ ప్యాక్‌ను అమర్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. అదే ఎకో మోడ్‌లో అయితే ఇంకా ఎక్కువ రేంజ్ రావొచ్చు. కంపెనీ ఇందులో 4 కేడబ్ల్యూ పీఎంఎస్ మోటార్‌ను అమర్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు. ఇది కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
