Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Offers: ఏసీ కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 56శాతం డిస్కౌంట్.. పూర్తి వివరాలు

వాతావరణంలో ఉడుకెత్తుతోంది. వర్షాకాలం అయినా వేడి మాత్రం తగ్గలేదు. దాని తోడు విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు అనివార్యంగా ఏసీలను వినియోగిస్తున్నారు. దీంతో ఈ కాలంలో కూడా ఏసీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణంగా ఏసీల వినియోగం, కొనుగోళ్లు వేసవి కాలంలో అధికంగా ఉంటాయి. ఆఫర్లు కూడా అదే సమయంలో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏసీలపై అదిరే ఆఫర్లను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అందిస్తోంది.

Amazon Offers: ఏసీ కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 56శాతం డిస్కౌంట్.. పూర్తి వివరాలు
Wall Air Conditioner
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 10:01 PM

వాతావరణంలో ఉడుకెత్తుతోంది. వర్షాకాలం అయినా వేడి మాత్రం తగ్గలేదు. దాని తోడు విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు అనివార్యంగా ఏసీలను వినియోగిస్తున్నారు. దీంతో ఈ కాలంలో కూడా ఏసీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణంగా ఏసీల వినియోగం, కొనుగోళ్లు వేసవి కాలంలో అధికంగా ఉంటాయి. ఆఫర్లు కూడా అదే సమయంలో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏసీలపై అదిరే ఆఫర్లను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అందిస్తోంది. ఏకంగా 56శాతం డిస్కౌంట్లను టాప్ బ్రాండ్స్ అయిన డయాకిన్, వోల్టాస్, కేరియర్ వంటి వాటిపై అందిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు లభించే బెస్ట్ స్ల్పిట్ ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. దీనిపై అమెజాన్ ఏకంగా 56శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. అంటే దీని అసలు ధర రూ. 70,990 కాగా.. ఆఫర్ పై కేవలం రూ. 31,490కే లభిస్తోంది. ఈ ఏసీ సీఓ2 రిడక్షన్ టెక్నాలజీతో వస్తుంది. దీని సాయంతో గదిలో కార్బన్ డైయాక్సైడ్ స్థాయిలు తగ్గుతాయి.

కేరియర్ 1.5 టన్ 3 స్టార్ ఏఐ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. దీనిపై 48శాతం డిస్కౌంట్ మీరు పొందొచ్చు. దీని సాయంతో రూ. 67,790 ఉన్న ఈ ఏసీని మీరు కేవలం రూ. 34,990కే పొందొచ్చు. దీనిలో పీఎం 2.5/హెచ్ డీ ఫిల్టర్ ఉంటుంది. దీని సాయంతో డస్ట్, మైక్రో పార్టికల్ కాలుష్య కారకాలను నిరోధించి, మంచి ఫ్రెష్, ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ల్పింట్ ఏసీ.. దీనిపై 40శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 75,990కాగా ఆఫర్ పై రూ. 45,490కి సొంతం చేసుకోవచ్చు. దీనిలో వేరియబుల్ స్పీడ్ కంప్రెషర్ ఉంటుంది. ఇది హీట్ లోడ్ ఆధారంగా వపర్ ను అడ్జెస్ట్ చేసుకుంటుంది.

డయాకిన్ 1.5టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పింట్ ఏసీ.. దీని అసలు ధర రూ. 58,400 కాగా.. 35శాతం డిస్కౌంట్ తో రూ. 37,990కే కొనుగోలు చేయొచ్చు. ఇది ఇన్ బిల్ట్ స్టేబిలేజర్ ఉంటుంది.

ప్యానసోనిక్ 1.5 టన్ 5స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ల్పిట్ ఏసీ.. ఈ ఏసీపై 30శాతం ప్రారంభ తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 63,400కాగా, రూ. 44,490కి దీనిని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ల పరిమితకాలం మాత్రమే. వినియోగదారులు ఏసీ కొనుగోలుచేయాలనుకుంటే త్వరపడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..