Aadhaar-PAN Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందో లేదో డౌట్‌గా ఉందా? అయితే ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి..
జూన్ 30 తర్వాత మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ కాకపోతే మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అయిపోతుంది. తద్వారా ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం, పలు సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం వంటివి చేయలేరు. ఒకవేళ మీరు ఇప్పటికీ మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయండి.

మన దేశంలో ప్రతిఒక్కరికీ ఉండాల్సిన కచ్చితమైన ఐడెంటిఫికేషన్ నంబర్లు ఆధార్, పాన్. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అటు ప్రభుత్వం నుంచ ఏం సాయం అందదు.. మీరు కూడా ఏ కార్యకలాపాలు కూడా చేసుకోలేరు. దీనిలో పాన్ కార్డు ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జరగడానికి ఉపకరిస్తే.. ఆధార్ కార్డు విభిన్న అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రతి పన్ను చెల్లింపు దారుడికి ఆధార్, పాన్ అనుసంధానం అనేది తప్పనిసరి. అందు కోసం ప్రభుత్వం పలు దఫాలుగా డెడ్ లైన్ పెంచుకుంటూ వస్తోంది. పలు రకాలుగా పౌరులకు అవగాహన కల్పిస్తోంది. జూన్ 30న తుది గడువుగా ప్రకటించింది. 2017, జూలై 1 నుంచి పాన్ కార్డుకు అప్లై చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ కాకపోతే మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అయిపోతుంది. తద్వారా ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం, పలు సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం వంటివి చేయలేరు. ఒకవేళ మీరు ఇప్పటికీ మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయండి. ఒకవేళ లింక్ చేసినా అది సరిగ్గా లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలను కొంటే దానికీ ఓ మార్గం. అదెంటో ఇప్పుడు చూద్దాం..
ఆన్ లైన్లోనే తనిఖీ చేసుకోవచ్చు..
ఆధార్ పాన్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే జూన్ 30 తర్వాత ఒకవేళ ఆధార్ పాన్ లింక్ కాకపోతే పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్ లింక్ స్టేటస్ ను తనిఖీ చేయడం అవసరం. మీరు ఒకవేళ దానిని తనిఖీ చేయాలనుకొంటే ఇంట్లో నుంచే చూసుకోవచ్చు. దానికి ఆన్ లైన్లో అవకాశం కల్పించారు. అది స్టెప్ బై స్టెప్ విధానాన్ని చూద్దాం..
- ఇన్ కమ్ ట్యాక్ అధికారిక వెబ్ సైట్లోకి లాగిన్ కాకుండానే మీరు ఆధార్, పాన్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవచ్చు.
- అందుకోసం మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. పోర్టల్ లోని హోమ్ పేజీలోకి వెళ్లి క్విక్ లింక్స్ ని క్లిక్ చేసి దానిలో లింక్ ఆధార్ స్టేటస్ ని ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ పూర్తయిన తర్వాత మీకు స్క్రీన్ పై ఓ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది.
- లింక్ అయితే లింక్ అయ్యింది అని, లేదా ప్రోగ్రెస్ లో ఉంటే రిక్వెస్ట్ సెంట్ టు యూఐడీఏఐ అని చూపిస్తుంది.
ఒకవేళ మీరు ఆధార్ పాన్ లింక్ స్టేటస్ ని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్ సైట్లో లాగిన్ అయ్యి చూసుకోవాలంటే ఈ విధంగా చేయాలి..
- ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి.. దానిలో డ్యాష్ బోర్డును ఎంపిక చేసుకొని లింక్ ఆధార్ స్టేటస్ ని క్లిక్ చేయాలి.
- లేదా మై ప్రోఫైల్ లోకి వెళ్లి లింక్ ఆధార్ స్టేటస్ ని క్లిక్ చేయొచ్చు.
- ఒకవేళ అప్పటికే లింక్ అయ్యి ఉంటే లింక్ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది. లేకుంటే స్టేటస్ అప్ డేట్ చేస్తుంది.
ఫీజులు ఇలా..
వాస్తవానికి ఈ ఆధార్, పాన్ లింక్ అనే ప్రక్రియకు చాలా కాలం క్రితమే డెడ్ లైన్ ముగిసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది అపరాధ రుసుంతో. 2022 జూన్ 30 వరకూ రూ. 500 అపరాధ రుసుంతో ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చు. అలాగే 2022 జూలై 1 నుంచి 2023 జూన్ 30 వవరకూ రూ. 1000 వరకూ ఫైన్ విధిస్తున్నారు. ఈ ఫైలింగ్ పోర్టల్ లో మీరు అప్లై చేయాలంటే ముందుగా దీనికి సంబంధించిన చలానాను సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







