AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే అత్యధికంగా పన్ను ఆదా చేయొచ్చు.. పూర్తి వివరాలు

కొన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను మినహాయింపులు పొందొచ్చు. వాటిల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకున్నా పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. అలాగే మీ జీతంలో పన్ను విధింపు లేని అలవెన్సులు ఏమైనా మీ యజమాని నుంచి పొందినట్లు అయితే మీరు రూ. 50,000 వరకూ పన్ను ఆదా చేసుకొనే వీలుంటుంది.

Income Tax: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే అత్యధికంగా పన్ను ఆదా చేయొచ్చు.. పూర్తి వివరాలు
Income Tax
Madhu
|

Updated on: Feb 05, 2024 | 6:52 AM

Share

పన్ను చెల్లింపుదారుల సమయం ఆసన్నమైంది. తమ ఇన్ కమ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి తుది గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ గరిష్టంగా తమ పన్నులు ఎలా ఆదా చేయాలన్న దాని గురించి ఆలోచిస్తుంటారు. నెల నెలా జీతం పొందే వ్యక్తి.. ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి వచ్చిన సమయంలో వారు తప్పనిసరిగా తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో కొంత మినహాయింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం ప్రభుత్వమే కొన్ని వెసులుబాటులు కల్పించింది. ముఖ్యంగా కొన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను మినహాయింపులు పొందొచ్చు. వాటిల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకున్నా పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. అలాగే మీ జీతంలో పన్ను విధింపు లేని అలవెన్సులు ఏమైనా మీ యజమాని నుంచి పొందినట్లు అయితే మీరు రూ. 50,000 వరకూ పన్ను ఆదా చేసుకొనే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఏ పథకంలో ఎంత మొత్తం పన్ను ఆదా చేసుకోవచ్చు. తెలుసుకుందాం..

ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ట్రిక్స్..

నేషనల్ పెన్షన్ సిస్టమ్.. వ్యక్తులు సెక్షన్ 80సీసీడీ(2) కింద జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద ప్రయోజనాన్ని పొందొచ్చు. అందులో వ్యక్తుల ప్రాథమిక జీతంలో 10 శాతం అతని తరఫున ఎన్పీఎస్ లో పెట్టబడుతుంది. ఇది పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక కంపెనీ ప్రతి నెలా ఎన్‌పిఎస్‌లో దాదాపు రూ. 5,000 వేస్తే, పన్నులు దాదాపు రూ.13,000 తగ్గుతుంది.

హోమ్ లోన్.. గృహ రుణం తీసుకోవడం కూడా పన్నులను తగ్గించడంలో సహాయపడుతుంది. అనుకూలమైన నిబంధనలతో యజమాని నుంచి రుణం పొందేందుకు అర్హులైన ఉద్యోగులు కచ్చితంగా ఆస్తిని నిర్మించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పన్ను బాధ్యతను కూడా తగ్గించుకోవాలి. ఉదాహరణకు, 7 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాలకు రూ. 25,00,000 రుణం తీసుకుంటే, అతను రూ. 1.5 లక్షల వార్షిక వడ్డీతో పాటు రూ. 20,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపు రూ. 30,000 పన్నులను తగ్గించడంలో సహాయపడవచ్చు.

ఇవి కూడా చదవండి
  • వ్యక్తులు సెలవు ప్రయాణ భత్యం, పుస్తకాలు, వార్తాపత్రిక బిల్లుల రీయింబర్స్‌మెంట్‌తో సహా చెల్లింపు నిర్మాణాలలో ఇతర పన్ను అలవెన్సులను కూడా అన్వేషించాలి. పన్ను విధించదగిన భాగాన్ని తగ్గించడానికి వారి ప్రత్యేక అలవెన్సుల మొత్తాన్ని కూడా తగ్గించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డివిడెండ్‌ల వంటి ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయానికి అనుగుణంగా, ఎఫ్డీలకు బదులుగా డెట్ ఫండ్‌ల వైపు వెళ్లాలి.
  • కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల యజమాని నుంచి ఎటువంటి తగ్గింపులను క్లెయిమ్ చేయకుండా వారిని పరిమితం చేయవచ్చని గమనించాలి. ఎన్‌పీఎస్‌లో చేసిన పెట్టుబడులకు, వైద్య బీమా ప్రీమియంలకు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి వడ్డీకి లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలకు మినహాయింపులను అనుమతించే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..