PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?

దేశంలోని రైతులు ఈ పథకాన్ని అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో e-KYC, భూ రికార్డుల ధృవీకరణను తప్పనిసరి చేసింది. పథకం కింద తమ భూమి రికార్డులు, ఇ-కెవైసిని ఇంకా ధృవీకరించని రైతులు వెంటన ఈ పని చేయడం చాలా ముఖ్యం..

PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2024 | 6:34 AM

దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా వీటిలో ఒకటి. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6 వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ ఆర్థిక సాయం రూ.6 వేలు రైతుల ఖాతాలో ప్రతి ఏటా మూడు విడతలుగా అందజేస్తోంది.

ఒక్కో విడత కింద రైతు ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 15 వాయిదాలను రైతుల ఖాతాలకు జమ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఫిబ్రవరి లేదా వచ్చే మార్చిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. అయితే వాయిదాల నగదు బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దేశంలోని రైతులు ఈ పథకాన్ని అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో e-KYC, భూ రికార్డుల ధృవీకరణను తప్పనిసరి చేసింది. పథకం కింద తమ భూమి రికార్డులు, ఇ-కెవైసిని ఇంకా ధృవీకరించని రైతులు వెంటన ఈ పని చేయడం చాలా ముఖ్యం. లేకుంటే వారికి ఈ విడత డబ్బులు అందే అవకాశం ఉండదు. మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా ఈ పథకం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి