AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MW Spartan 2.0 SUV: మహీంద్రా థార్ ఈవీకి పోటీగా.. అదే లుక్లో సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

సీజెక్ స్టార్టప్ కు చెందిన ఎండబ్ల్యూ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఎస్‌యూవీ వేరియంట్‌గా ఫోర్స్ గుర్ఖా మోడల్లో ఇది తయారైంది. ఈ ఎస్‌యూవీ స్పార్టన్ 2.0. ఇది చూడటానికి మహీంద్రా థార్ కారును పోలీ ఉంది. అలాగే జిమ్నీ మూడు డోర్ల కారుకు కూడా దగ్గరగా ఉంది. ఈ స్పార్టన్ 2.0 కారు సింగిల్ చార్జ్ పై 240కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుందని కంపెనీ ప్రకటించుకుంది.

MW Spartan 2.0 SUV: మహీంద్రా థార్ ఈవీకి పోటీగా.. అదే లుక్లో సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Mw Spartan 2.0 Ev
Madhu
|

Updated on: Feb 05, 2024 | 7:22 AM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగుంది. ఆ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు పలు స్టార్టప్ లు కూడా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో సీజెక్ స్టార్టప్ కు చెందిన ఎండబ్ల్యూ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఎస్‌యూవీ వేరియంట్‌గా ఫోర్స్ గుర్ఖా మోడల్లో ఇది తయారైంది. ఈ ఎస్‌యూవీ స్పార్టన్ 2.0. ఇది చూడటానికి మహీంద్రా థార్ కారును పోలీ ఉంది. అలాగే జిమ్నీ మూడు డోర్ల కారుకు కూడా దగ్గరగా ఉంది. ఈ స్పార్టన్ 2.0 కారు సింగిల్ చార్జ్ పై 240కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుందని కంపెనీ ప్రకటించుకుంది.

స్పార్టన్ 2.0 ఫీచర్లు..

ఈ కొత్త కారు లో బాడీ షెల్, ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, సస్పెన్షన్, గేర్, ఇంటీరియర్ అంశాలన్నీ ఫోర్స్ మోటార్స్ అందించింది. బ్యాటరీ చైనా నుంచి తీసుకున్నారు. ఇతర విడి భాగాలు ఎండబ్ల్యూ సొంతంగా తయారు చేసింది. ఈ కారు తయారు చేసే ముందు స్పార్టన్ పాత వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొత్త స్పార్టన్ 2.0ను తమ ఇంజినీర్లు తయారు చేసినట్లు ఎండబ్ల్యూ ప్రకటించింది.

స్పార్టన్ 2.0 పవర్ ట్రైన్..

దీనిలో సింగిల్ మోటార్ ఉంటుంది. ఇది 176హెచ్పీ, 1,075 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ముందు వెనుక హిల్ డిసెంట్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైన లాకింగ్ వ్యవస్థను అందించారు. ఈ కారులో 57.4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ బానెట్ కింద ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. దీనిని 90కేడబ్ల్యూ చార్జర్ సాయంతో అరగంటలోనే 20 నుంచి 80శాతం వరకూ బ్యాటరీ ఫుల్ చేసుకోవచ్చు. బై డైరెక్షనల్ చార్జింగ్ కు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్పార్టన్ 2.0 డిజైన్..

ఈ కారు 4,116 ఎంఎం పొడవు, 1,812 ఎంఎం వెడల్పు కలిగి ఉంటుంది. జిమ్నీ కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. గుర్ఖా ఆధారిత స్పార్టన్ 2.0 కెర్బ్ వెయిట్ 2,350కేజీలు ఉంటుంది. స్పెన్షన్ కోసం కోయిల్ స్ప్రింగ్స్, యాంటీ రోల్ బార్స్ ముందు, వెనుకు ఉంటాయి. ఇంటీరియర్ లో ముందు వైపు అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి. టూ వే అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ విండోస్, ఏసీ, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోకి ఎప్పుడు వస్తుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు