AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loans: అతి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు.. ఈ బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువే..

ఈ రుణాలు మీ ఊహించని ఖర్చులను కవర్ చేస్తాయి. ఎటువంటి పత్రాలు కూడా అవసరం లేదు. అయితే దీనిలో వడ్డీ మాత్రం మిగిలిన రుణ రకాలతో పోల్చితే అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని అసురక్షిత రుణాలుగా బ్యాంకర్లు వర్గీకరిస్తారు. క్రెడిట్ కార్డు రుణాలతో పోల్చితే మాత్రం తక్కువ వడ్డీ రేట్లే ఉంటాయి. వీటిల్లో వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకలా ఉండవు. అలాగే వ్యక్తులను బట్టి కూడా మారుతుంటాయి.

Personal Loans: అతి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు.. ఈ బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువే..
Personal Loan
Madhu
|

Updated on: Mar 18, 2024 | 8:23 AM

Share

అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక వెసులుబాటును కల్పించేవి పరనల్ లోన్లు(వ్యక్తిగత రుణాలు). బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేయకుండా బ్యాంకులో ఎటువంటి తనఖా లేకుండా మంజూరయ్యే లోన్లు ఇవి. ఈ రుణాలు మీ ఊహించని ఖర్చులను కవర్ చేస్తాయి. ఎటువంటి పత్రాలు కూడా అవసరం లేదు. అయితే దీనిలో వడ్డీ మాత్రం మిగిలిన రుణ రకాలతో పోల్చితే అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని అసురక్షిత రుణాలుగా బ్యాంకర్లు వర్గీకరిస్తారు. క్రెడిట్ కార్డు రుణాలతో పోల్చితే మాత్రం తక్కువ వడ్డీ రేట్లే ఉంటాయి. వీటిల్లో వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకలా ఉండవు. అలాగే వ్యక్తులను బట్టి కూడా మారుతుంటాయి. రుణ గ్రహీతల వయస్సు, వారి క్రెడిట్ చరిత్ర, నెలవారీ ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, మొత్తం ఆర్థిక పరిస్థితి, యజమాని వర్గం (ఎంఎన్సీ/ ప్రభుత్వం/ రక్షణ, మొదలైనవి)ను బట్టి మారుతుంటుంది. అదే సమంలో మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత తక్కువకు మీరు రుణాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం(మార్చి 13, 2024 నాటికి) ఈ పర్సనల్ లోన్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతి తక్కువ వడ్డీ రేటు 10.50% అందిస్తోంది. మిగిలిన బ్యాంకులలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్.. ఈ బ్యాంక్ అత్యల్ప వడ్డీ రేటు అందిస్తోంది. ఏడాదికి 10.50శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,747 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,149 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4,999గా వరకు ఉంటుంది.

టాటా క్యాపిటల్.. టాటా క్యాపిటల్ వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.99% నుంచి ప్రారంభమవుతాయి. 5 సంవత్సరాలకు రూ. 5 లక్షల రుణం కోసం ఈఎంఐ రూ. 10,869 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 1 లక్షకు ఈఎంఐ రూ. 2,174 నుంచి ప్రారంభవుతుంది. ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 5.5% వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంక్ సంవత్సరానికి 11.15% నుంచి 15.30% వరకు వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ అందిస్తుంది. రూ. 5 లక్షల రుణానికి ఈఎంఐ రూ. 10,909 నుంచి రూ. 11,974 వరకు, రూ. 1 లక్షకు రూ. 2,182 నుంచి రూ. 2,395 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ రుసుము 1.5% వరకూ ఉంటుంది, కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా రూ. 15,000 వరకూ వసూలు చేస్తారు.

ఐసీఐసీఐ బ్యాంక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.65% నుంచి ప్రారంభమవుతాయి. 5 సంవత్సరాలలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి, ఈఎంఐ రూ. 10,784 నుంచి ప్రారంభమవుతాయి. అదే రూ. 1 లక్షకు, ఇది రూ. 2,157 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2.50% వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా.. దీనిలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 11.05% నుంచి 18.75% మధ్య మారుతూ ఉంటాయి. రూ.5 లక్షల రుణానికి ఈఎంఐ రూ.10,884 నుంచి రూ.12,902 వరకు, రూ.1 లక్షకు రూ.2,177 నుంచి రూ.2,580 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా రూ. 10,000తో 2% వరకు ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ వార్షిక వడ్డీ రేట్లను 10.49% నుంచి అందిస్తుంది. 5 సంవత్సరాలలో రూ. 5 లక్షల రుణం కోసం ఈఎంఐ రూ. 10,744 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 1 లక్షకు ఇది రూ. 2,149 నుంచి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% వరకు ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్.. దీనిలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.99% నుంచి ప్రారంభమవుతాయి. 5 సంవత్సరాలకు రూ. 5 లక్షల రుణం కోసం ఈఎంఐ రూ. 10,869 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు ఇది రూ. 2,174 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 3% వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంక్ లో సంవత్సరానికి 10.75% నుంచి 14.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ.5 లక్షల రుణం కోసం ఈఎంఐ రూ.10,809 నుంచి రూ.11,829 వరకు ఉంటుంది. రూ.1 లక్షకు రూ.2,162 నుంచి రూ.2,366 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ. 5,000 వరకూ ఉంటుంది సాధారణంగా రుణమొత్తంలో 1% తీసుకుంటారు.

కెనరా బ్యాంక్.. ఈ బ్యాంక్లో వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.95% నుంచి 16.40% మధ్య మారుతూ ఉంటాయి. రూ.5 లక్షల రుణానికి ఈఎంఐ రూ.10,859 నుంచి రూ.12,266 వరకు, రూ.1 లక్షకు రూ.2,172 నుంచి రూ.2,453 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50%, గరిష్టంగా రూ. 2,500గా ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో సంవత్సరానికి 10.40% నుంచి 17.95% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. రూ.5 లక్షల రుణానికి ఈఎంఐ రూ.10,772 నుంచి రూ.12,683 వరకు, రూ.1 లక్షకు రూ.2,144 నుంచి రూ.2,537 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1% వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..