Gold Loans: అతి తక్కువ వడ్డీ.. ఈఎంఐ అవకాశం.. గోల్డ్ లోన్ కావాలంటే ఈ బ్యాంకులైతేనే బెటర్..
ఒక్కో చోట ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఒకవేళ మీరు బంగారంపై లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే.. ముందుగా అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంక్ ఏదో ఆరా తీయాలి. అన్ని బ్యాంకుల్లోని వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఫీజులను తనిఖీ చేయాలి. అప్పుడే మీరు లాభపడే అవకాశం ఉంటుంది. గోల్డ్ లోన్లపై అతి తక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఏవి? పూర్తి వివరాలు కోసం ఈ కథనం చివరి వరకూ చదవండి..
ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అయినప్పుడు ఆదుకునేవి బంగారంపై రుణాలు. ఇంట్లోని బంగారపు వస్తువులో తక్షణ గోల్డ్ లోన్లు మీకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం, ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్సింగ్ సంస్థలు కూడా బంగారంపై రుణాలు ఇస్తుంటాయి. అయితే ఒక్కో చోట ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఒకవేళ మీరు బంగారంపై లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే.. ముందుగా అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంక్ ఏదో ఆరా తీయాలి. అన్ని బ్యాంకుల్లోని వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఫీజులను తనిఖీ చేయాలి. అప్పుడే మీరు లాభపడే అవకాశం ఉంటుంది. గోల్డ్ లోన్లపై అతి తక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఏవి? పూర్తి వివరాలు కోసం ఈ కథనం చివరి వరకూ చదవండి..
బంగారం రేటు ఆధారంగా రుణమొత్తం..
అమెరికా ఆర్థిక గణాంకాల బలహీనత కారణంగా బంగారం ధర ఈ వారం రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ.66,000కి చేరుకుంది. మీ బంగారాన్ని విక్రయించడానికి, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బంగారం నిల్వలను తాకట్టు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఆయా బ్యాంకుల వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బంగారు రుణాలపై అత్యల్ప వడ్డీ రేటును ప్రైవేట్ బ్యాంక్లు ఆఫర్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులు 9.6 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. ఆ జాబితాను ఇప్పుడు చూద్దాం..
- ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.5 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. బ్యాంకుల్లో అందించే బంగారు రుణాలపై ఇది అతి తక్కువ వడ్డీ రేటు. ఈ సందర్భంలో ఈఎంఐ (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా) రూ. 22,568గా ఉంటుంది.
- ఇండియన్ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 22,599 నెలవారీ వాయిదా మొత్తం.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చౌకైన బంగారు రుణాలు ఇచ్చే జాబితాలో తదుపరి స్థానంలో ఉంది. ఇది 8.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై ఈఎంఐ రూ. 22,610గా ఉంటుంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణాలపై 8.8 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. అటువంటి రుణాలపై మీరు రూ. 22,631 ఈఎంఐ చెల్లించాలి.
- కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణాలపై 9.25 శాతం వడ్డీ రేటును విధిస్తున్నాయి. ఈఎంఐలు రూ. 22,725గా ఉంటాయి.
- బ్యాంక్ ఆఫ్ బరోడా రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.4 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. రుణగ్రహీతలు రూ.22,756 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రుణగ్రహీతలు రూ.22,798 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 10 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. రుణగ్రహీతలు రూ.22,882 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- యాక్సిస్ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 17 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. రుణగ్రహీతల ఈఎంఐలు రూ. 24,376 పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..