Home Loan: తక్కువ వడ్డీకి గృహ రుణాలిస్తున్న టాప్-10 బ్యాంకులివే.. చెక్ చేసుకోండి

Home Loan Interest Rate: ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో గృహ రుణాలపై వడ్డీ రేటు పెరిగాయి. ప్రస్తుతం అతి తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇస్తున్న 10 బ్యాంకులు ఏంటో ఇక్కడ చెక్ చేసుకోండి.

Home Loan: తక్కువ వడ్డీకి గృహ రుణాలిస్తున్న టాప్-10 బ్యాంకులివే.. చెక్ చేసుకోండి
Representative Image
Follow us

|

Updated on: Jun 25, 2022 | 11:22 AM

Home Loan Interest Rate: ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం మరింత పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు పెంచినప్పుడల్లా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఉన్న రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. దీంతో వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొంటున్నారు రుణ గ్రహీతలు. లాభ నష్టాలు బేరిజు వేసుకుని ఒక బ్యాంకులోని తమ హోమ్ లోన్స్‌ను తక్కువ వడ్డీకి రుణాలిస్తున్న బ్యాంకులు, సంస్థల్లోకి మార్చుకుంటున్నారు. తద్వారా రుణ భారం నుంచి కాస్త ఊరట చెందుతున్నారు రుణగ్రహీతలు. క్రెడిట్ స్కోర్ బాగుంటే మునుపటి బ్యాంకు కంటే తక్కువ వడ్డీకే కొన్ని బ్యాంకులు హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. మరి ప్రస్తుతం అతి తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇస్తున్న 10 బ్యాంకులు ఏంటో ఇక్కడ చెక్ చేసుకోండి.

వేతన ఉద్యోగులకు హోం లోన్ వడ్డీ రేటు..

1.పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.8 శాతం కనిష్ఠ వడ్డీ రేటు నుంచి 8.05 శాతం గరిష్ఠ వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2.బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.90 శాతం నుంచి 8.60 శాతం వడ్డీ రేటుకి హోమ్ లోన్ ఇస్తోంది.

3.యాక్సిస్ బ్యాంక్ 7 శాతం నుంచి 7.30 శాతం వడ్డీ రేటు ఉంది.

4.కెనరా బ్యాంక్ 7.05 శాతం నుంచి 9.25 శాతం వడ్డీ రేటుకు గృహ రుణాలు ఇస్తోంది.

5.ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 7.05 శాతం నుంచి 7.30 శాతం వడ్డీ రేటు ఉంది.

6.కరూర్ వైశ్యా బ్యాంక్ 7.15 శాతం నుంచి 9.35 శాతం వడ్డీ రేటుకి రుణాలిస్తోంది.

7.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.30 శాతం నుంచి 8.70 శాతం వడ్డీ రేటుకి గృహ రుణాలిస్తోంది.

8.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తోంది.

9.పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 7.4 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తోంది.

10.ఇండియన్ బ్యాంక్ 7.40 శాతం నుంచి 8.15 శాతం వడ్డీ రేటుకి గృహ రుణాలు ఇస్తోంది.

స్వయం ఉపాధి పొందుతున్న వారి హోమ్ లోన్ వడ్డీ రేటు..

1.పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 శాతం నుంచి 8.15 శాతం వడ్డీ రేటుకి గృహ రుణాలు ఇస్తోంది.

2.బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.90 శాతం నుంచి 8.75 శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తోంది.

3.యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 7.05 శాతం నుంచి 7.35 శాతంగా ఉంది.

4.ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 7.05 శాతం నుంచి 7.30 శాతం వడ్డీ రేటుకి రుణాలిస్తోంది.

5.కెనరా బ్యాంక్ 7.10 శాతం 9.30 శాతం వడ్డీ రేటుకి రుణాలిస్తోంది.

6.కరూర్ వైశ్యా బ్యాంక్ 7.15 శాతం నుంచి 9.35 శాతం వడ్డీ రేటుకి రుణాలిస్తోంది.

7.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40 శాతం నుంచి 9.10 శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తోంది.

8.యూకో బ్యాంక్ 7.45 శాతం నుంచి 8.80 శాతం వడ్డీ రేటుకి గృహ రుణాలు ఇస్తోంది.

9.బ్యాంక్ ఆఫ్ బరోడా 7.45 శాతం నుంచి 8.80 శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తోంది.

10.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కనిష్ఠ వడ్డీ రేటు 7.55 శాతంగానూ.. గరిష్ఠ వడ్డీ రేటు 9.20 శాతంగానూ ఉంది.

(ఇక్కడిచ్చిన వడ్డీ రేట్లలో వివిధ కారణాలతో మార్పులు ఉండొచ్చు. సంబంధిత బ్యాంకులను నేరుగా సంప్రదించి అసలైన వడ్డీ రేటును నిర్ధారించుకోవాలని సూచన)

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం