Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. ఏయే రోజుల్లో అంటే..

ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకింగ్‌ సేవలను వినియోగిస్తుంటారు. రకరకాల లావాదేవీలను నిర్వహించేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా బ్యాంకింగ్‌ రంగం మరింత అభివృద్ధి చెందింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్‌ సేవలను..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. ఏయే రోజుల్లో అంటే..
Hdfc Bank
Follow us
Subhash Goud

|

Updated on: Jun 03, 2023 | 7:32 PM

బ్యాంకింగ్‌ రంగంలో అప్పుడప్పుడు కొన్ని సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకింగ్‌ సేవలను వినియోగిస్తుంటారు. రకరకాల లావాదేవీలను నిర్వహించేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా బ్యాంకింగ్‌ రంగం మరింత అభివృద్ధి చెందింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌ సహాయంతో ఎన్నో బ్యాంకు సేవలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు కీలక సమాచారం అందించింది. సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నందున ఈ నెలలో మూడు రోజుల పాటు పలు బ్యాంకింగ్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు బ్యాంకు సూచించింది. ఇందు కోసం వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.

ఏయే రోజుల్లో సర్వీసులు అంతరాయం:

జూన్‌ 4న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. జూన్‌ 10న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జూన్‌ 18న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు

ఎలాంటి సేవలకు అంతరాయం ఏర్పడనుంది?

సిస్టమ్‌ అప్‌గ్రేట్‌ కారణంగా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. అకౌంట్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, డిపాజిట్‌, డబ్బులు ట్రాన్ఫఫర్‌ చేయడం, ఇతర లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది.

ఇవి కూడా చదవండి
Hdfc Bank

Hdfc Bank