Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నపసిడి ధరలు దిగొచ్చాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,300 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,330 గా ఉంది.

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2023 | 5:22 AM

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నపసిడి ధరలు దిగొచ్చాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,300 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,330 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.700, 24 క్యారెట్ల పసిడిపై రూ. 770 మేర తగ్గాయి. ఇక వెండి ధరలు కూడా దిగొచ్చాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.73,400 లుగా కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,330 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 లుగా పలుకుతోంది

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.73,000లుగా ట్రెండ్‌ అవుతోంది. ఇక చెన్నైలో రూ.77,800, కేరళలో రూ.77,800 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..