AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Pension System: ఆ పథకంలో పెట్టుబడితో రిటైర్‌మెంట్‌ లైఫ్‌ హ్యాపీ.. పైగా బోలెడన్ని పన్ను ప్రయోజనాలు

ఉద్యోగులు తమ పన్ను బాధ్యతలను ఆప్టిమైజ్ చేయడంపై దృష్టి సారించడం, ఆదాయపు పన్నుపై ఆదా చేయడానికి వివిధ మార్గాల అన్వేషిస్తూ ఉంటారు. ఇలాంటి వారిఇక నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అనేది మంచి పెట్టుబడి సాధనంగా ఉంటుంది. NPS అనేది చాలా ప్రభావవంతమైన పదవీ విరమణ ఉత్పత్తి. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్‌లు, జీ-సెకన్‌లు, ఒకరి రిస్క్ అపెటైట్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ నిధులు, పీఎప్‌ఆర్‌డీఏ ద్వారా బాగా నియంత్రించే అత్యంత తక్కువ ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలతో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్ అంతటా ఆస్తి కేటాయింపు వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 

National Pension System: ఆ పథకంలో పెట్టుబడితో రిటైర్‌మెంట్‌ లైఫ్‌ హ్యాపీ.. పైగా బోలెడన్ని పన్ను ప్రయోజనాలు
Senior Citizen
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2024 | 12:15 PM

మరో రెండు మూడు నెలల్లో ఆర్థిక సంవత్సర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేయర్స్‌ పన్ను ఆదా గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ పెట్టుబడుల రుజువు అడుగుతూ ఉంటారు. ఉద్యోగులు తమ పన్ను బాధ్యతలను ఆప్టిమైజ్ చేయడంపై దృష్టి సారించడం, ఆదాయపు పన్నుపై ఆదా చేయడానికి వివిధ మార్గాల అన్వేషిస్తూ ఉంటారు. ఇలాంటి వారిఇక నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అనేది మంచి పెట్టుబడి సాధనంగా ఉంటుంది. NPS అనేది చాలా ప్రభావవంతమైన పదవీ విరమణ ఉత్పత్తి. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్‌లు, జీ-సెకన్‌లు, ఒకరి రిస్క్ అపెటైట్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ నిధులు, పీఎప్‌ఆర్‌డీఏ ద్వారా బాగా నియంత్రించే అత్యంత తక్కువ ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలతో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్ అంతటా ఆస్తి కేటాయింపు వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.

ఎన్‌పీఎస్‌ పన్ను ప్రయోజనాలు

  • నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1) కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద రూ. 50,000 వరకు తగ్గింపు ప్రత్యేకంగా ఎన్‌పీఎస్‌ పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.
  • కార్పొరేట్ ఎన్‌ఎసీఎస్‌ మోడల్‌లోని సబ్‌స్క్రైబర్‌లు ప్రాథమిక జీతంలో 10 శాతం వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (2) కింద అదనపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం రూ. 7.5 లక్షలకు పరిమితం చేశారు.
  • పాత ఆదాయపు పన్ను విధానంలో ప్రయోజనాలను పొందే వారికి పన్ను సంబంధిత మినహాయింపులన్నీ వర్తిస్తాయి. అయితే కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రయోజనాలు పొందే వారికి కార్పొరేట్ ఎన్‌పీఎస్‌ మోడల్ వర్తిస్తుంది.

ఎన్‌పీఎస్‌ అంటీ ఈఈఈ మోడల్‌

సబ్‌స్క్రైబర్‌లు ముందుగా వివరించిన విధంగా ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌లపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. రెండో మినహాయింపు ఎలాంటి పన్ను మినహాయింపు లేకుండా రాబడిని ఆర్జించే విరాళాలకు వర్తిస్తుంది. ఉపసంహరణ (60 శాతం వరకు) కూడా పన్ను మినహాయింపు. అంటే కార్పస్‌లో 40 శాతం యాన్యుటీ ఉత్పత్తిని కొనుగోలు చేయడం కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. యాన్యుటీలో పెట్టుబడి నుంచి పెన్షన్ చెల్లింపులు పొందే సమయంలో చందాదారుల వర్తించే రేటుపై పన్ను విధిస్తారు. కాబట్టి వ్యక్తులు, జాతీయ పెన్షన్ వ్యవస్థను అర్థం చేసుకోవడ, అది అందించే ప్రత్యేక పన్ను ప్రయోజనాలపై ఆదా చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..