National Pension Scheme: పదవీవిరమణ కోసం బెస్ట్ స్కీమ్.. నెలవారీ ఆదాయంతో పన్ను ప్రయోజనాలు కూడా..
రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందించే పథకాలలో బెస్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకం. మొదట్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉన్న పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకంగా జనాదరణ పొందింది. ఆ తర్వాత 2009లో దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఎవరైనా ఎన్పీఎస్ ఖాతా ప్రారంభించొచ్చు

ఇటీవల కాలంలో అందరూ రిటైర్ మెంట్ ప్లానింగ్ కలిగి ఉంటున్నారు. అది అవసరం కూడా. ఎందుకంటే శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా సంపాదిస్తారు. కుటుంబాన్ని పోషించుకుంటారు. ఉద్యోగి అయితే ఉద్యోగం చేసుకుని వచ్చే జీతంతో హాయిగా బతుకుతారు. మరి రిటైర్ మెంట్ తర్వాత? అందుకే ముందు నుంచే రిటైర్ మెంట్ ప్లానింగ్ అవసరమని చాలా మంది గుర్తించారు. దీంతో ఏదో రిటైర్ మెంట్ పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందించే పథకాలలో బెస్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకం. మొదట్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉన్న పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకంగా జనాదరణ పొందింది. ఆ తర్వాత 2009లో దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఎవరైనా ఎన్పీఎస్ ఖాతా ప్రారంభించొచ్చు, దానిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో అసలు దీనిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఎలా ఉంటాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ఇది ఎన్పీఎస్..
ఈ ఎన్పీఎస్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వంతో పాటు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కలిసి నిర్వహిస్తాయి. ఇది పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూపొందిన పథకం. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం. ఇది పౌరులందరికీ పదవీ విరమణ ఆదాయ భద్రతను అందించడానికి భవిష్యత్తు కోసం పొదుపు అలవాటును పెంపొందించడానికి ఉద్దేశించినది. ప్రతి పౌరునికి తగినంత పదవీ విరమణ ఆదాయాన్ని అందిస్తూ వారికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.
ఎన్పీఎస్ ఖాతాకు అర్హతలు..
భారతదేశ పౌరుడు, నివాసి అయినా లేదా నాన్-రెసిడెంట్ అయినా, కొన్ని షరతులకు లోబడి ఖాతాలను ప్రారంభించొచ్చు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తును సమర్పించే తేదీ నాటికి 18 – 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిర్దేశించిన కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
ఎన్పీఎస్ ఖాతా ప్రయోజనాలు..
సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఎన్పీఎస్ ఒక శక్తివంతమైన సాధనం. ఇది పన్ను ప్రయోజనాలు, మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లు, హామీతో కూడిన పెన్షన్‌ను అందిస్తుంది. ఇది విలువైన పదవీ విరమణ ప్రణాళిక ఎంపికగా ఉంటుంది. సబ్‌స్క్రైబర్‌కు ఉపాధి లభిస్తే, ఖాతాను ప్రభుత్వ రంగం, కార్పొరేట్ మోడల్ వంటి ఏదైనా ఇతర రంగానికి మార్చవచ్చు.
నెలవారీ ఆదాయం.. సబ్‌స్క్రైబర్‌లు పదవీ విరమణ వయస్సును చేరుకున్నప్పుడు, సాధారణంగా ఎన్పీఎస్ నుంచి నిష్క్రమించినప్పుడు, వారు పీఎఫ్ఆర్డీఏ ఆమోదిత జీవిత బీమా కంపెనీ నుంచి జీవిత వార్షికాదాయాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారి సేకరించిన పెన్షన్ సంపదలో కొంత భాగాన్ని సాధారణ ఆదాయ మార్గంగా మార్చడానికి ఎంచుకోవచ్చు. వారు కావాలనుకుంటే మిగిలిన మొత్తాన్ని ఏకమొత్తంగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉద్యోగికి పన్ను ప్రయోజనం.. ఎన్పీఎస్ కి కంట్రిబ్యూట్ చేసే ఉద్యోగి వ్యక్తులు రెట్టింపు పన్ను ప్రయోజనం పొందుతారు. వారు తమ స్వంత విరాళాలు, వారి యజమాని చేసిన వాటికి తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) ప్రకారం జీతంలో 10% వరకు పన్ను మినహాయింపు (బేసిక్ + డీఏ)మొత్తం రూ.1.50 లక్షలు వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..