AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office MIS Scheme: ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా రాబడి.. పోస్టాఫీసు అందించే అద్భుత పథకం ఇదే..!

అనేక రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తారు. వీటిలో ఒకటి నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌). ఇది డిపాజిట్ స్కీమ్. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. పీఓఎంఐఎస్‌లో ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా మీకు ప్రతి నెలా వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం పోస్టాఫీసు ఎంఐఎస్‌లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.

Post Office MIS Scheme: ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా రాబడి.. పోస్టాఫీసు అందించే అద్భుత పథకం ఇదే..!
Post Office Saving Scheme
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 14, 2024 | 12:55 PM

Share

ధనం మూలం ఇదం జగత్‌.. అంటే ప్రపంచంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే నెలనెలా వారికి వచ్చిన సొమ్మును కొంత మేర పొదుపు చేస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా ఓ మరింత ఎక్కువ సొమ్ము చేతికి వచ్చినప్పుడు ఆ సొమ్మును వృథా చేయకుండా పొదుపు చేయడానికి వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అనేక రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తారు. వీటిలో ఒకటి నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌). ఇది డిపాజిట్ స్కీమ్. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. పీఓఎంఐఎస్‌లో ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా మీకు ప్రతి నెలా వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం పోస్టాఫీసు ఎంఐఎస్‌లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్‌లో మొత్తం ఒకేసారి 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తారు. అంటే మీరు వరుసగా 5 సంవత్సరాలు వడ్డీ తీసుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం మీకు తిరిగి వస్తుంది. అయితే మీకు ఐదేళ్లలోపు డబ్బు అవసరమైతే మరియు దానిని ఉపసంహరించుకోవాలనుకుంటే లేదా నెలవారీ సంపాదన పథకాన్ని ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగించాలనుకుంటే నియమాలను చూద్దాం.

ఐదేళ్లలోపు సొమ్ము విత్‌డ్రా చేస్తే..?

  • ఒకవేళ ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకుంటే మీరు మొదటి సంవత్సరం వరకు సదుపాయాన్ని పొందలేరు.
  • ఒక సంవత్సరం తర్వాత మీరు ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందుతారు. కానీ ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి కొంత డబ్బు పెనాల్టీగా తీసివేస్తారు కాబట్టి మీరు నష్టపోతారు.
  • మీరు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం తీసేస్తారు. 
  • మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలలోపు డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే, డిపాజిట్ చేసిన మొత్తంలో 1 శాతం తీసివేసిన తర్వాత డిపాజిట్ మొత్తం మీకు తిరిగి వస్తుంది.

ఎంఐఎస్‌ స్కీమ్‌ పొడిగింపు నియమాలు

సాధారణంగా మీరు ఎఫ్‌డీ, పీపీఎఫ్‌ మొదలైన అన్ని పథకాలలో మీ ఖాతాను పొడిగించే సదుపాయాన్ని పొందుతారు. కానీ మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్‌లో ఈ సదుపాయాన్ని పొందలేరు. మీరు పథకానికి సంబంధించిన ప్రయోజనాలను మరింత పొందాలనుకుంటే మీరు మెచ్యూరిటీ తర్వాత కొత్త ఖాతాను తెరవవచ్చు.

ఇవి కూడా చదవండి

నెలవారీ ఆదాయం ఇలా

పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో ఒకే ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే, 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ.5,500 నెలవారీ ఆదాయం పొందవచ్చు. కాగా జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.9,250 ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం