AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Schemes: పోస్టాఫీస్ లో పొదుపు.. మీ బాలికల భవిష్యత్ కు మలుపు.. ఈ పోస్టల్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

ముఖ్యంగా బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసుల్లోనే గ్రామీణులు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సొంత ఊళ్లోనే పోస్టాఫీస్ ఉండడం, అలాగే ఎక్కడికో వెళ్లి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఎక్కువ మంది పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తుంటారు.

Postal Schemes: పోస్టాఫీస్ లో పొదుపు.. మీ బాలికల భవిష్యత్ కు మలుపు.. ఈ పోస్టల్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..
Post Office Schemes
Nikhil
|

Updated on: Feb 04, 2023 | 11:37 AM

Share

భారతదేశంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మన పెట్టుబడి నమ్మకమైన భరోసాతో సొమ్ము చెల్లిస్తాయని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసుల్లోనే గ్రామీణులు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సొంత ఊళ్లోనే పోస్టాఫీస్ ఉండడం, అలాగే ఎక్కడికో వెళ్లి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఎక్కువ మంది పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తుంటారు. ప్రజల ఆదరణ మేరకు ఇండియా పోస్టల్ డిపార్ట్ మెంట్ కూడా వివిధ పథకాలను ప్రవేశపెడుతుంటుంది. వయస్సుకు తగిన పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటుంది. అలాగే చాలా మంది పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రలు వారి పెళ్లి కోసం అలాగే వారి బంగారు భవిష్యత్ కోసం పొదుపు చేయడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి నమ్మకమైన పోస్టల్ ప్లాన్స్ ఏమున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకంపై ఖాతా తెరవాలంటే కచ్చితంగా ఆడపిల్ల తల్లిదండ్రులై ఉండాలి. అలాగే ఆ ఆడపిల్లకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. అలాగే ఈ అకౌంట్ సంవత్సారానికి రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఆడపిల్లకు 15 ఏళ్లు వచ్చే వరకూ డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇందులో డిపాజిట్ చేసిన సొమ్ముపై 7.5 వడ్డీ వస్తుంది. అయితే ఈ ఖాతాలోని సొమ్మును ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోలేం. ఆడపిల్లకు 21 సంవత్సరాల వచ్చిన తర్వాతే సొమ్ము తీసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు దాటాకా చదువు కోసం లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ తక్కువ ప్రమాదకరమైన ప్రాయోజిత పథకం అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది పెట్టుబడి పెడితే అమ్మాయిల భవిష్యత్ కు సరిపోతుంది. ఎన్ఎస్ సీ పై 7.0 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

టెర్మ్ డిపాజిట్

ఇది పోస్టాఫీసులో ఉన్న అద్భుతమైన పథకం. ఇది ఇంచుమించు బ్యాంకులు ఆఫర్ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిది. అయితే దీనిలో వడ్డీ రేట్లు మనం ఎన్ని సంవత్సరాలకు వేస్తున్నామో? దాని బట్టి ఉంటుంది. ఇందులో ఐదేళ్ల కాలానికి డిపాజిట్ వేస్తే 7.0 శాతం వడ్డీ వస్తుంది. 

యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్

యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆడపిల్లల భవిష్యత్ కు పోస్టాఫీసుల్లో ఉండే అద్భుతమైన ప్లాన్. ఈ పథకంలో పెట్టుబడి పెడితే పన్ను రాయితీలతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం