National Pension Scheme: పదవీవిరమణ తర్వాత సుఖమయ జీవినం కావాలా? అయితే ఇది ట్రై చేయండి.. అధిక రాబడి..పైగా పన్ను ప్రయోజనాలు..
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మంచి పదవీవిరమణ పథకం. దీనిలో నెలనెలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. టెన్యూర్ అనంతరం పెన్షన్ రూపేణా మీరు సొమ్ము మొత్తాన్ని తిరిగి తీసుకొనే వీలుంటుంది. అయితే ఎంత మొత్తం దీనిలో రాబడి వస్తుందనే విషయం కచ్చితంగా చెప్పలేం. మీరు నెలనెలా జమ చేసే సొమ్మును మీ తరఫున మార్కెట్లోని వివిధ రకాల షేర్లు, స్టాక్ లలో పెట్టుబడులు పెడతారు. ఆ స్టాక్ ల పరిస్థితిని బట్టి మీరు రాబడి ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక ప్రణాళిక అందిరికీ అవసరమే. అది ఉద్యోగులకు అయినా, చిరు వ్యాపారికైనా, పెద్ద బిజినెస్ మ్యాన్ కి అయినా అది ప్లానింగ్ లేకపోతే నష్టపోతారు. ముఖ్యంగా రిటైర్ మెంట్ తర్వాత జీవితం సుఖమయంగా ఉండాలంటే.. మీరు అనుకున్న లక్ష్యాలను అందుకోవాలంటే ప్రణాళిక బద్ధమైన జీవన విధానం, మంచి పథకాలలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కు డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి ఈ పథకం ప్రారంభించినప్పుడు 2004 జనవరిలో కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే అమలు చేసేవారు. అయితే 2009 నుంచి అన్ని రంగాలలోని వారికి ఈ పథకం అందుబాటులో ఉంది. దీనిలోని రాబడి, పన్ను ప్రయోజనాల నేపథ్యంలో దీనిలో అధికశాతం మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? దానిలో రాబడి ఎలా ఉంటుంది. వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)..
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మంచి పదవీవిరమణ పథకం. దీనిలో నెలనెలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. టెన్యూర్ అనంతరం పెన్షన్ రూపేణా మీరు సొమ్ము మొత్తాన్ని తిరిగి తీసుకొనే వీలుంటుంది. అయితే ఎంత మొత్తం దీనిలో రాబడి వస్తుందనే విషయం కచ్చితంగా చెప్పలేం. మీరు నెలనెలా జమ చేసే సొమ్మును మీ తరఫున మార్కెట్లోని వివిధ రకాల షేర్లు, స్టాక్ లలో పెట్టుబడులు పెడతారు. ఆ స్టాక్ ల పరిస్థితిని బట్టి మీరు రాబడి ఆధారపడి ఉంటుంది. ఎన్పీఎస్ మార్కెట్ లింక్డ్ పథకం అన్నమాట. ఈ పథకం ప్రభుత్వంతో పాటు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)చే సంయుక్తంగా నిర్వహించబడుతుంది. పదవీ విరమణ కోసం రూపొందించబడిన దీర్ఘకాలిక, స్వచ్ఛంద పెట్టుబడి కార్యక్రమం ఇది.
రాబడి ఎక్కువే..
ఎన్పీఎస్ లో స్థిరమైన పెన్షన్ మొత్తాన్ని వాగ్దానం చేయకపోయినా.. గణనీయమైన లాభాలతో కూడిన పెన్షన్‌కు హామీ ఇస్తుంది. దీనిలో పెట్టుబడి పెట్టే పని సంవత్సరాలలో వారి పెన్షన్ ఖాతాలకు స్థిరమైన విరాళాలు అందించేలా ఉద్యోగులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. పదవీ విరమణ చేసిన తర్వాత, చందాదారుడు వారి సేకరించిన కార్పస్‌లో కొంత భాగాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తం నెలవారీ ఆదాయంగా పెన్షన్ రూపేణా చెల్లిస్తారు.
రెండు రకాలుగా ఎన్పీఎస్..
ఎన్పీఎస్ పథకాన్ని రెండు రకాలుగా విభజించారు. టైర్-1 ఖాతాలు, టైర్-2 ఖాతాలు. టైర్-1 ఖాతాను ఎంచుకున్న వ్యక్తులు పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే టైర్-2 ఖాతాలు ముందస్తు ఉపసంహరణలను అనుమతిస్తాయి.
పన్ను మినహాయింపులు..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ ప్రకారం, ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్పీఎస్ కార్పస్‌లో 60 శాతం నగదును పన్ను రహితంగా ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..