AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఇంకా వెనక్కి రాని రూ. 10 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు.. ఆర్బీఐ గవర్నర్.

ఇదే విషయమై తాజాగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం కేవలం రూ. 10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ మిగతా మొత్తం కూడా తిరిగి వస్తాయని, ప్రజలు రూ. 2 వేల నోట్లను తిరిగి ఇచ్చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ నెల ప్రారంభంలో ఇదే విషయమై శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ..

RBI: ఇంకా వెనక్కి రాని రూ. 10 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు.. ఆర్బీఐ గవర్నర్.
RBI
Narender Vaitla
|

Updated on: Oct 20, 2023 | 8:24 PM

Share

2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మే 19న ఈ రూ. రెండు వేల నోట్లను కూడా మార్కెట్‌ నుంచి ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్లు తిరిగి వచ్చాయి.

ఇదే విషయమై తాజాగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం కేవలం రూ. 10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ మిగతా మొత్తం కూడా తిరిగి వస్తాయని, ప్రజలు రూ. 2 వేల నోట్లను తిరిగి ఇచ్చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ నెల ప్రారంభంలో ఇదే విషయమై శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్‌ నోట్లలో 87 వాతం బ్యాంకుల్లో డిపాజిట్లుగా తిరిగి వచ్చాయని, మిగిలినవి కౌంటర్ల ద్వారా మార్చుకున్నారని గవర్నర్‌ తెలిపారు.

మొదట మార్కెట్‌లో ఉన్న రూ. 2000 వేల నోట్లను ఉపసంహరించుకునేందుకు సెప్టెంబర్‌ 30 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు అక్టోబర్‌ 7వ తేదీ వరకు పొడగించారు. దీంతో ప్రస్తుతం అక్టోబర్‌ 7వ తేదీతో బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల స్వీకరణను నిలిపివేశారు. అయితే ఇప్పటికీ రూ. 2 వేల నోట్లను స్వీకరిస్తున్నారు. వ్యక్తులు లేదా సంస్థలు రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోకి ఒకేసారి రూ. 20,000 వరకు మార్చుకునే అవకాశం కల్పించారు.

మళ్లీ రూ. 1000 నోట్లు రానున్నాయా.?

ఇదిలా ఉంటే రూ. 2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత ఆర్బీఐ రూ. 1000 నోట్లను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. రూ. 1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని స్పస్టం చేసింది. రూ. 1000 నోట్లను మళ్లీ తెస్తారనే వార్తలు పూర్తిగా ఊహాజనితం అని తేల్చి చెప్పారు. దీంతో రూ. 1000 నోట్లు మళ్లీ మార్కెట్ లోకి వచ్చే పరిస్థితులు లేవని స్పష్టమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..