Aadhaar: మీ ఆధార్‌తో ఎవరైనా సిమ్ తీసుకున్నారనే అనుమానం ఉందా.? ఇలా చెక్ చేసుకోండి..
దీంతో దేనికిపడితే దానికి ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డ్ దుర్వినియోగం కూడా జరుగుతోంది. కొందరు నేరగాళ్లు ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నటి మొన్న ఒక్క సిమ్ కార్డ్‌తో ఏకంగా 600కిపైగా సిమ్‌కార్డులు...
ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. సిమ్ కార్డ్ మొదలు కారు కొనుగోలు వరకు కచ్చితంగా సిమ్ కార్డ్ ఉండాల్సిందే. దీంతోపాటు బ్యాంకులకు సంబంధించిన ప్రతీ చిన్న పనికి కూడా ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు.
దీంతో దేనికిపడితే దానికి ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డ్ దుర్వినియోగం కూడా జరుగుతోంది. కొందరు నేరగాళ్లు ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నటి మొన్న ఒక్క సిమ్ కార్డ్‌తో ఏకంగా 600కిపైగా సిమ్‌కార్డులు తీసుకున్నట్లు విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. దీంతో మన ఆధార్ కార్డు ఎంత వరకు సేఫ్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ మన ఆధార్ కార్డును ఉపయోగించి ఎవరైనా సిమ్ తీసుకున్నారా.? లేదా అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డుపై ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులను మాత్రమే తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ సిమ్‌లను పొందడానికి అనుమతి ఉండదు. ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అయితే ఓ చిన్న ట్రిక్ ద్వారా మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..
ముందుగా సంచార్ సతి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మొబైల్ కనెక్షన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. వెంటనే మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది, అనంతరం ఓటీపీని ఎంటర్ చేయాలి. దీంతో మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీంతో మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ల జాబితాను పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..