Fraud: రూ.824 కోట్ల కుంభ కోణం.. భారీ మోసానికి పాల్పడిన 16 కంపెనీలు: జీఎస్టీ అథారిటీ!

జీఎస్టీ అథారిటీ భారీ మోసాన్ని బయటపెట్టింది. 16 బీమా కంపెనీలు రూ. 824 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను దుర్వినియోగం చేశాయని వస్తువులు, సేవల పన్ను అథారిటీ గుర్తించింది..

Fraud: రూ.824 కోట్ల కుంభ కోణం.. భారీ మోసానికి పాల్పడిన 16 కంపెనీలు: జీఎస్టీ అథారిటీ!
Gst Bhavan
Follow us

|

Updated on: Oct 01, 2022 | 7:14 AM

జీఎస్టీ అథారిటీ భారీ మోసాన్ని బయటపెట్టింది. 16 బీమా కంపెనీలు రూ. 824 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను దుర్వినియోగం చేశాయని వస్తువులు, సేవల పన్ను అథారిటీ గుర్తించింది. అథారిటీ వివరాల ప్రకారం.. ఈ కంపెనీలు నకిలీ ఇన్‌వాయిస్‌లను జారీ చేయడానికి తమ మధ్యవర్తులను ఉపయోగించుకున్నాయి. 16 బీమా కంపెనీలు రూ.824 కోట్ల ఐటీసీని తీసుకున్నాయని, ఈ కంపెనీలు ఇప్పటి వరకు రూ.217 కోట్లను స్వచ్ఛందంగా చెల్లించాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌కు తెలిపింది.

దీనిపై డీజీజీఐ ముంబై జోనల్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రకటనలో సంస్థల పేర్లను వెల్లడించలేదు. ఈ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్, బ్రాండ్ యాక్టివేషన్ వంటి సేవలను అందించడానికి అనేక మధ్యవర్తులు జారీ చేసిన ఇన్‌వాయిస్‌ల ఆధారంగా ITCని పొందాయి. కానీ ఈ కంపెనీలు వాస్తవానికి అలాంటి సేవలను అందించలేదని ప్రకటనలో పేర్కొంది. అయితే జీఎస్టీ చట్టాలలో అటువంటి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు ఎలాంటి నిబంధన లేదు.

బీమా కంపెనీలు చేస్తున్న NBFCల కోసం ఏజెంట్ వివరాల ప్రకారం.. సూక్ష్మ-ఫైనాన్సింగ్ వ్యాపారాలలో నిమగ్నమై ఉన్న అనేక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బీమా కంపెనీల కార్పొరేట్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీలు తమ సింగిల్ ప్రీమియం క్రెడిట్ (లింక్డ్) బీమా పాలసీలను క్రాస్ సెల్లింగ్ చేస్తున్నాయి. ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం.. కార్పొరేట్ ఏజెంట్‌కు నామమాత్రపు కమీషన్ మాత్రమే అనుమతించబడుతుంది. ఈ నిబంధనలను తప్పించుకోవడానికి బీమా కంపెనీలు ప్రకటనలు, వెబ్ మార్కెటింగ్ సేవలను సరఫరా చేయడానికి మధ్యవర్తుల నుండి ఇన్‌వాయిస్‌లను పొందడం, NBFCలకు కమీషన్‌లను బదిలీ చేయడం వంటివి చేశాయి. కానీ సేవలు ఎప్పుడూ అందలేదు. ఈ మధ్యవర్తులు అటువంటి సరఫరాల కోసం NBFCల నుండి ఇన్‌వాయిస్‌లను అందుకున్నారు. అయితే ఈ బీమా కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్‌, బ్రాండ్‌ యాక్టివేషన్‌ వంటిసేవలకు అందించడానికి అనేక మధ్యవర్తులుజారీ చేసిన ఇన్‌వాయిస్‌ల ఆధారంగా ఐటీసీ పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 16 కంపెనీల కుంభ కోణంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!