Gold, Silver Price Today: మగువలకు షాకిచ్చిన పసిడి ధరలు.. పెరిగిన బంగారం.. అదే బాటలో వెండి

దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే..మరో రోజు పెరుగుతున్నాయి. దేశంలో తాజాగా అక్టోబర్‌ 1న బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారంపై..

Gold, Silver Price Today: మగువలకు షాకిచ్చిన పసిడి ధరలు.. పెరిగిన బంగారం.. అదే బాటలో వెండి
Gold Silver Price
Follow us

|

Updated on: Oct 01, 2022 | 6:26 AM

దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. దేశంలో తాజాగా అక్టోబర్‌ 1న బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరుగగా, కిలో వెండిపై రూ.600లకుపైగా పెరిగింది. అయితే రాష్ట్రాల బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,900 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉంది.

☛ తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240 వద్ద ఉంది.

☛ మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద ఉంది.

☛ పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.

☛ కర్ణాటకలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక దేశంలో పసిడి ధర పెరిగితే వెండి మాత్రం కూడా అదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, విజయవాడలో రూ.62,000 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.60,000 ఉండగా, ముంబైలో రూ.57,000 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.57,000 ఉండగా, కోల్‌కతాలో రూ.57,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,000 ఉండగా, కేరళలో రూ.60,000 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధర పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి