Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న డిమాండ్.. కొత్త సైట్ల వైపు మొగ్గు
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌లో చేసేందుకు ఇష్టపడుతున్నారు. గత రెండేళ్లలో చూస్తే వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌లపై ఎక్కువ ప్రాధాన్యత..
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌లో చేసేందుకు ఇష్టపడుతున్నారు. గత రెండేళ్లలో చూస్తే వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌లపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం, తక్కువ ధరలకు ప్రోడక్ట్‌లు లభించడం. ఆన్‌లైన్ షాపింగ్ విధానాల వల్ల వినియోగదారులకు కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం, వాటి ఫీచర్స్‌ను సరిపోల్చడం, కస్టమర్ల రివ్యూలను చదివి ఆర్డర్లు చేయడం సులభంగా మారింది.
అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజన్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వారి సహాయంతో కస్టమర్‌లు తమ ఇ-కామర్స్ షాపింగ్ కార్ట్ నుండి ‘చెక్ అవుట్’ చేసే ముందు అంటే వస్తువులను ఆర్డర్ చేసే ముందు ఆ ఉత్పత్తుల గురించి తెలుసుకుంటారు. ఒక నివేదిక ప్రకారం.. భారతీయ కస్టమర్లలో దాదాపు 64 శాతం మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా ఆన్‌లైన్ రివ్యూల ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు. చాలా కొత్త ఇ-కామర్స్ స్టార్టప్‌లు కూడా సోషల్ మీడియా ద్వారా విక్రయించడం, కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యే వ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. వీటికి సోషల్ కామర్స్ స్టార్టప్‌లు అని పేరు పెట్టారు. మీషో, డీల్‌షేర్, బుల్బుల్ వంటి స్టార్టప్‌లు ముందంజలో ఉన్నాయి.
కొన్ని ఇ-కామర్స్ సైట్‌లు కస్టమర్‌లకు ఆన్‌లైన్‌లో స్టోర్ అనుభవాన్ని కూడా అందిస్తున్నాయి. వర్చువల్ సేవలు అనేది ప్రజలకు షాపింగ్ అనుభవాన్ని ప్రత్యేకంగా అందించే కొత్త ట్రెండ్. మీరు మీ ఇంటికి బెడ్‌షీట్ లేదా కర్టెన్‌ని కొనుగోలు చేస్తుంటే వర్చువల్ సేవల సహాయంతో మీ ఇంట్లో అది ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇలాంటి సదుపాయం వల్ల ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.
వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు కారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ దిగ్గజాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. పెద్ద మొత్తంలో నష్టాలు కలిగించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పెద్ద ఈ-కామర్స్ సైట్‌ల కస్టమర్లు ఇప్పుడు ఇతర సైట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి మరో కారణం కూడా ఉంది. సాధారణ ఇ-కామర్స్ సైట్‌లకు బదులుగా నిర్దిష్ట ఇ-కామర్స్ సైట్‌ల నుండి వస్తువులను కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే బట్టలు కొనడానికి వారు ఎలక్ట్రానిక్ కోసం Ajio, Myntra సైట్‌లకు వెళతారు. ఇతర ప్రోడక్స్ట్ లేదా గాడ్జెట్‌లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, కాస్మెటిక్ లేదా బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, Nykaa లేదా Foxy సైట్లకు వెళ్తుంటారు.
దీనికి తోడు ప్రతి ఒక్కరు షాపింగ్‌ల కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు కారణం ఈ-కామర్స్ షాపింగ్ ప్రపంచంలో పోటీ పెరుగుతుండడమే. కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి. ఇందులో రకరకాల డిస్కౌంట్లు, కూపన్లు ఇస్తున్నారు. దీని కారణంగా షాపింగ్ చేసే కస్టమర్లు ఇష్టమైన ఇ-కామర్స్ సైట్‌లకు బదులుగా కొత్త సైట్‌లు, యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే వస్తువులు చౌకగా లభిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి