Railway Parcel Booking: రైల్వే పార్శిల్‌ బుకింగ్‌ అంటే ఏమిటి..? మీ బైక్‌ను రైలులో ఇతర ప్రాంతానికి తరలించడం ఎలా?

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రయాణికుల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికులకే కాకుండా ఏదైనా వస్తువులను ఇతర ప్రాంతాలకు..

Railway Parcel Booking: రైల్వే పార్శిల్‌ బుకింగ్‌ అంటే ఏమిటి..? మీ బైక్‌ను రైలులో ఇతర ప్రాంతానికి తరలించడం ఎలా?
Railway Parcel Booking
Follow us

|

Updated on: Jan 22, 2023 | 6:55 AM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రయాణికుల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికులకే కాకుండా ఏదైనా వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించాలనుకుంటే కూడా సులభంగా రైలులో తరలించవచ్చు. చాలా మంది తమ కొత్త లేదా పాత బైక్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపుకొంటారు. అటువంటి పరిస్థితిలో వారి బైక్‌ను 400-500 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ఎలా పంపాలనేది చాలా మందికి పెద్ద సమస్య. దీని కోసం వారు రవాణాను ఉపయోగిస్తారు. ఇలా బైక్‌లుగానీ, ఇతర వస్తువులను పంపేందుకు చాలా మార్గాలున్నాయి. అంతే కాకుండా ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో బైక్‌ వస్తే బైక్‌ దెబ్బతింటుందేమోనన్న భయం ఉంటుంది. ఈ అవాంతరాలన్నింటినీ నివారించడానికి, మీరు రైల్వే సేవలను ఉపయోగించవచ్చు.

భారతీయ రైల్వేలు ఏదైనా వస్తువులను రవాణా చేయడానికి రెండు సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో మీరు లగేజీ కోసం బుకింగ్ చేసుకోవచ్చు లేదా పార్శిల్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. లగేజీని మీరు మీ స్వంతంగా ప్రయాణించడం ద్వారా మీ వస్తువులను మీతో తీసుకెళ్లడం. పార్శిల్ గురించి అంటే మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వస్తువులను పంపాలనుకుంటున్నారు.. ఆ వస్తువులను పంపుకొనే సదుపాయం ఉంటుంది. అంటే మీరు వాటిలో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు కావాల్సిన ప్రాంతానికి బైక్‌ను, ఇతర వస్తువులను పంపుకోవచ్చు.

పార్శిల్ కోసం ఎలా బుక్ చేసుకోవాలి

పార్శిల్ బుకింగ్ కోసం మీరు సమీపంలోని రైల్వే స్టేషన్‌ను సందర్శించాలి. మీరు అక్కడ ఉన్న పార్శిల్ కౌంటర్ నుండి ఈ సదుపాయం గురించి సమాచారాన్ని పొందవచ్చు. సమాచారం పొందిన తర్వాత, అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఒరిజినల్ కాపీ, ఫోటోకాపీ రెండింటినీ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ కాపీని ధృవీకరణ కోసం అడుగుతారు. పార్శిల్ చేసే ముందు రైల్వే ఉద్యోగులు మీ బైక్ ట్యాంక్‌ని తనిఖీ చేస్తారు. అలాగే బైక్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఇవి కూడా చదవండి

రవాణా ఛార్జీ ఎంత ఉంటుంది?

ఏదైనా వస్తువులు రైల్వే ద్వారా పంపాలనుకుంటే అప్పుడు సరుకు బరువు, దూరాన్ని బట్టి లెక్కిస్తారు. మీరు తక్కువ ధరలో కొత్త లేదా పాత బైక్‌ను రవాణా చేయాలనుకుంటే రైల్వేలు ఉత్తమ ఆప్షన్‌. పార్శిల్ కంటే లగేజీకి ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. 500 కి.మీల వరకు బైక్ పంపాలంటే దాదాపు రూ.1200 ఖర్చవుతుంది. ఇది కాకుండా మీ నుండి రూ.300 నుండి 500 వరకు ప్యాకింగ్ ఛార్జీలు వసూలు చేయవచ్చు. ఇలా సులభంగా బైక్‌ను రైలు ద్వారా మీ ప్రాంతానికి పంపుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి