Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal India: కోల్ ఇండియా 92 లక్షల షేర్ల విక్రయం..ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్

 ప్రభుత్వం సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా 92.44 లక్షల షేర్లను ప్రభుత్వం విక్రయిస్తోంది. కోల్ ఇండియా ఉద్యోగులకు ఈ షేర్లను ఆఫర్ చేస్తున్నారు. కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 92.44 లక్షల షేర్లు ఉన్నాయి. అంటే 0.15 శాతం ఉంటుంది. అర్హత కలిగి ఉండి ఎంపిక చేసిన కొంతమంది ఉద్యోగులకు..

Coal India: కోల్ ఇండియా 92 లక్షల షేర్ల విక్రయం..ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్
Coal India
Follow us
Subhash Goud

|

Updated on: Jun 19, 2023 | 4:11 PM

ప్రభుత్వం సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా 92.44 లక్షల షేర్లను ప్రభుత్వం విక్రయిస్తోంది. కోల్ ఇండియా ఉద్యోగులకు ఈ షేర్లను ఆఫర్ చేస్తున్నారు. కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 92.44 లక్షల షేర్లు ఉన్నాయి. అంటే 0.15 శాతం ఉంటుంది. అర్హత కలిగి ఉండి ఎంపిక చేసిన కొంతమంది ఉద్యోగులకు ఈ షేర్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ షేర్లను కోల్ ఇండియా ఉద్యోగులకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయిస్తున్నారు. 92,44,092 ఈక్విటీ షేర్లను రూ.226.10 ధరకు అర్హులైన ఉద్యోగులకు విక్రయించడానికి ఆఫర్ చేయబడింది. జూన్ 21 నుంచి జూన్ 23 వరకు ఓఎఫ్‌ఎస్‌ ఆఫర్ బుధవారం నుండి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది.

కోల్ ఇండియాలో ప్రభుత్వ వాటా 66.13 శాతం. మిగిలిన వాటా ప్రజలకు పంపిణీ చేయబడింది. ఇప్పుడు 0.15 శాతం వాటాలను విక్రయిస్తే ప్రభుత్వ వాటా 66 శాతం కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు.

కోల్ ఇండియాకు మంచి సంపాదన

2022-23 ఆర్థిక సంవత్సరానికి కోల్ ఇండియా భారీ ఆదాయాన్ని అందుకుంది. ఆ సంవత్సరం దాని నికర లాభం రూ.28,125 కోట్లు. ఇది ఆల్ టైమ్ హై రికార్డ్‌ లాభం. అంతకుముందు సంవత్సరం (2021-22)లో ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో 17,378 శాతం. నికర లాభం 62 శాతం పెరిగింది. అయితే 11వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం సిఫార్సును అమలు చేయకుంటే కోల్ ఇండియా లాభం భారీగా ఉండేది. కొత్త వేతనాల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు) లాభం 18 శాతం కంటే తక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు కోల్ ఇండియా కంపెనీ షేర్ ధర కూడా గత ఏడాది కాలంలో 100% పెరిగింది. 24 శాతం పెరుగుదల కనిపించింది. జూన్ 19 ఉదయం ట్రేడింగ్‌లో దాని ఒక షేరు ధర రూ.229 కి పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి