LPG Gas Cylinder: ఎల్‌పీజీ సిలిండర్‌పై ఈ కోడ్‌లు, నంబర్లను గమనించారా..? వీటి అర్థం ఏంటో తెలుసుకోండి

ఎల్‌పీజీ గ్యాస్‌ ప్రతి ఇంటికి అవసరమైనదిగా మారింది. ఎల్‌పీజీ సిలిండర్లను చాలా ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన..

LPG Gas Cylinder: ఎల్‌పీజీ సిలిండర్‌పై ఈ కోడ్‌లు, నంబర్లను గమనించారా..? వీటి అర్థం ఏంటో తెలుసుకోండి
Lpg Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2023 | 8:05 PM

ఎల్‌పీజీ గ్యాస్‌ ప్రతి ఇంటికి అవసరమైనదిగా మారింది. ఎల్‌పీజీ సిలిండర్లను చాలా ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయాలి.

ఈ కోడ్ అర్థం ఏమిటి?

గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో నమోదు చేయబడుతుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీ గురించి చెబుతుంది. సిలిండర్‌పై రాసిన A,B,C,D అంటే సంవత్సరంలో 12 నెలలు. అయితే ఈ సిలిండర్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందో సంఖ్య చెబుతుంది.

త్రైమాసిక ప్రాతిపదికన ఈ సిలిండర్లను పంపిణీ చేస్తారు. సంవత్సరంలో 12 నెలలు నాలుగు భాగాలుగా విభజించి ఉంటాయి.

ఇవి కూడా చదవండి
  • A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి.
  • B అంటే ఏప్రిల్, మే, జూన్.
  • C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
  • D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీల అర్థం. ఇవి నెలలను సూచిస్తుంది.

ఉదాహరణకు.. ఒక సిలిండర్‌లో A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. అలాగే 23 అంటే 2023 సంవత్సరంలో గడువు ముగుస్తుంది అని అర్థం. మరోవైపు, B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్‌లలో ముగుస్తుందని, 23 అంటే 2023లో గడువు ముగుస్తుందని అర్థం.

Lpg Gas Cylinder

Lpg Gas Cylinder

గడువు ముగిసిన సిలిండర్‌ వాడితే ప్రమాదమే..

మీరు గడువు తేదీ తర్వాత కూడా సిలిండర్‌ని ఉపయోగిస్తుంటే అది మీకు ప్రమాదకరం. సిలిండర్‌ పేలి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీరు సిలిండర్‌ పొందిన సమయంలో ఈ కోడ్‌లను తప్పకుండా తనిఖీ చేయాలి.