Google: దంపతులకు ఊహించని షాకిచ్చిన గూగుల్.. బిడ్డ పుట్టిన నాలుగు నెలల్లోనే ఇద్దరినీ ఒకేసారి..

చాలా కంపెనీలు రాత్రిరాత్రే ఉద్యోగులను తొలగించడం ప్రస్తుతం ఐటీ సహా అనేక రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. కంపెనీ వ్యయాల్లో అధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలే ఉండటంతో భారీ సంఖ్యలో కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.

Google: దంపతులకు ఊహించని షాకిచ్చిన గూగుల్.. బిడ్డ పుట్టిన నాలుగు నెలల్లోనే ఇద్దరినీ ఒకేసారి..
Google
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 26, 2023 | 9:39 AM

అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక మాంద్యం, అనిశ్చితుల మధ్య ప్రపంచ దిగ్గజ సంస్థలు లేఆఫ్ బాట పడుతుండటం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. చాలా కంపెనీలు రాత్రిరాత్రే ఉద్యోగులను తొలగించడం ప్రస్తుతం ఐటీ సహా అనేక రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. కంపెనీ వ్యయాల్లో అధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలే ఉండటంతో భారీ సంఖ్యలో కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందేమోనంటూ ప్రముఖ కంపెనీ ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కంపెనీకి కాకుండా తమ జీవితానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని సమాచారం.. ఎందుకంటే వారు ఒక సంస్థకు సంవత్సరాల తరబడి సేవలు అందించినప్పటికీ.. యాజమాన్యాలు ఎప్పుడైనా తొలగించవచ్చనే భయాందోళనలు పెరగడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినప్పటి నుంచి పలు వార్తలు ప్రచురితమవుతున్నాయి. గూగుల్ బాటలోనే చాలా కంపెనీలు పయనిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. గూగుల్‌లో పదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తొలగించారన్న వార్త ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేసిన దంపతులను కూడా గూగుల్ ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొంటున్నారు. కంపెనీ తాజా లేఆఫ్ ప్రక్రియలో పదేళ్లకు పైగా పనిచేస్తున్న భార్యాభర్తలను కూడా గూగుల్ తొలగించిందని.. వారికి నాలుగు నెలల పాప ఉన్నట్లు చెబుతున్నారు. బిజినెస్ ఇన్‌సైడర్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఉద్యోగం కోల్పోయిన దంపతులకు 2022 చివరిలో బిడ్డ పుట్టింది. అయితే, లేఆఫ్ ప్రకటనకు కొద్దిసేపటి ముందు దంపతుల్లో ఒకరు పేరెంటల్ లీవ్ తీసుకున్నారని.. దాదాపు ఎనిమిది నెలల పాటు టేకాఫ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని పేర్కొంది. అంతకుముందు కూడా గతేడాది చివరలో రెండు నెలల సెలవు తీసుకున్నారని.. వారిని మార్చి నుంచి ఆఫ్‌లో ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు.

కానీ, వారిద్దరినీ కంపెనీ తొలగించింది. దంపతులిద్దరూ ఒకే సమయంలో లేఆఫ్ ఇమెయిల్‌ను అందుకున్నారని సమాచారం. ఆ మహిళ గూగుల్‌లో ఆరు సంవత్సరాలు పని చేసింది.. ఆమె భర్త కూడా రెండేళ్ల క్రితం అదే కంపెనీలో చేరాడు. సెర్చ్ దిగ్గజం ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, దానికి సంబంధించి అనేక కారణాలను చెప్పింది.

ఇవి కూడా చదవండి

కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల తొలగింపు వెనుక ఒక కారణం ఓవర్‌హైరింగ్ అని పేర్కొన్నారు. కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుపై కఠినంగా వ్యవహరించవల్సి వస్తోందన్నారు. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో, అప్పటి అవసరాలకు తగ్గట్లుగా అధిక నియామకాలు చేపట్టామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసాధారణ నైపుణ్యమున్న ఉద్యోగులకూ వీడ్కోలు చెప్పాల్సి వస్తోందని, దీనిపై క్షమాపణలు చెబుతున్నట్లు పిచాయ్‌ వివరించారు. గత రెండేళ్ల నుంచి కంపెనీ ఆశించినంత మందంజలో ఉండటంతో అనేక మందిని నియమించుకున్నట్లు చెప్పారు.

అయితే, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం కారణంగా, ఖర్చులను ఆదా చేయడం కోసం ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్ ప్రక్రియలో ఉద్యోగాలు కొల్పోయిన వారికి 16 వారాల జీతం, Googleలో ప్రతి అదనపు సంవత్సరానికి రెండు వారాలు, కనీసం 16 వారాల GSU వెస్టింగ్‌తో సహా ఒక ప్యాకేజీని అందించనున్నట్లు Google CEO ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించారు. Google 2022 బోనస్‌లు, మిగిలిన సెలవు సమయాన్ని కూడా చెల్లిస్తుంది. ఇతర ప్రయోజనాలు 6 నెలల ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ నియామక సేవలు, ప్రభావితమైన వారికి ఇమ్మిగ్రేషన్ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇది చాలా కష్టమైన నిర్ణయమని, వ్యక్తులు, వారి పాత్రలు అత్యధిక ప్రాధాన్యతలకు అనుగుణంగా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు పిచాయ్ చెప్పారు. CEO వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆల్ఫాబెట్, ఉత్పత్తి ప్రాంతాలు, విధులు, స్థాయిలు, ప్రాంతాల వారిగా ఉద్యోగాల కోతలు జరిగాయి.

ఇంతకాలం కంపెనీ వృద్ధికి సహాయ సహకారాలు అందించారని.. ఉద్యోగుల సేవలు అమూల్యమైనవని కొనియాడిన సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!