TVS I-Qube: టీవీఎస్ ఐక్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో న్యూ వేరియంట్ లాంచ్..!

టీవీఎస్ ఐక్యూబ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో పెట్రో స్కూటర్లకు ధీటుగా ఉంటాయని ఆ స్కూటర్‌ను వాడేవారు చెబుతూ ఉంటారు. తాజాగా ఐక్యూబ్ వేరియంట్‌ను విస్తరిస్తూ టీవీఎస్  మోటార్ కంపెనీ ఐక్యూబ్‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ను 2 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రూ. 94,999 (బెంగళూరు ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ద్విచక్ర వాహనంలో 950 వాట్స్ ఛార్జర్ ఉంటుంది.

TVS I-Qube: టీవీఎస్ ఐక్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో న్యూ వేరియంట్ లాంచ్..!
Tvs Ev
Follow us

|

Updated on: May 16, 2024 | 4:15 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఓలా ఈవీ స్కూటర్ల తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో పెట్రో స్కూటర్లకు ధీటుగా ఉంటాయని ఆ స్కూటర్‌ను వాడేవారు చెబుతూ ఉంటారు. తాజాగా ఐక్యూబ్ వేరియంట్‌ను విస్తరిస్తూ టీవీఎస్  మోటార్ కంపెనీ ఐక్యూబ్‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ను 2 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రూ. 94,999 (బెంగళూరు ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ద్విచక్ర వాహనంలో 950 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ కేవలం రెండు గంటల్లో 0-80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ నయా వేరయంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టీవీఎస్ ఐక్యూబ్‌లో 5 అంగుళాల కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, వెహికల్ క్రాష్, టో అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ, 30-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ వేరియంట్ వాల్‌నట్ బ్రౌన్, పెరల్ వైట్ కలర్స్‌లో వస్తుంది. ఈవీ కస్టమర్ల రైడింగ్ ప్రవర్తన నుంచి నేర్చుకుంటూ  టీవీఎస్ ఐక్యూబ్‌లో సరికొత్త 2.2 కేడబ్ల్యూహెచ్ వేగవంతమైన ఛార్జింగ్ వేరియంట్‌ను, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీలో అదనపు వేరియంట్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందని ఐక్యూబ్ ప్రతినిధులు చెబతున్నారు.

డెలివరీలకు సిద్ధం

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ రెండు వేరియంట్లలో వస్తుంది. 3.4 కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్స్‌లో లభ్యం అవుతుంది.  టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ సిరీస్ ఇప్పుడు 3 బ్యాటరీ ఎంపికలతో మా కస్టమర్‌లకు అత్యంత సముచితమైన శ్రేణి, ధర కలయికను అందిస్తుంది. ఈ సిరీస్ ఇప్పుడు భారతదేశం అంతటా డెలివరీలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిదులు చెబుతున్నారు. 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1.56 లక్షలు (బెంగళూరు ఎక్స్-షోరూమ్), 950 వాట్స్ ఛార్జర్‌తో వస్తుంది. వేగవంతమైన ఛార్జ్ సమయం 2 గంటల 50 నిమిషాలుతో పాటు 100 కిలో మీటర్ల రైడింగ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ 7-అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్, ఐక్యూబ్ కోసం వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్ సెట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, 32 లీటర్ల సీటు నిల్వ స్థలం, గరిష్ట వేగం 78 కిలోమీటర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ  కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ రంగులలో లభిస్తుంది. కెపాసిటీలో అతిపెద్ద బ్యాటరీ అయిన 5.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ రూ. 1.85 లక్షలతో ప్రారంభమవుతుంది (బెంగళూరు ఎక్స్-షోరూమ్). ఇది 950 వాట్స్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ఛార్జ్ చేయడానికి 4 గంటల 18 నిమిషాలు పడుతుంది. అలాగే 150 కిలోమీటర్ల రైడింగ్ పరిధిని ఇస్తుంది. ఈ స్కూటర్ కూడా కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్‌లు దేశవ్యాప్తంగా 434 టీవీఎస్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..