Success story: బతుకు మార్చిన పుట్టగొడుగులు.. ఈ రైతు అందరికీ రోల్ మోడల్..

కష్టపడి పనిచేసి ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందుకు సాగిన అనేక మంది మనకు స్ఫూర్తిదాయకం నిలుస్తున్నారు. వారి జీవితాలను, విజయాలను తెలుసుకుంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాంటి వారే నైరుతి ఢిల్లీలోని హసన్ పూర్ గ్రామానికి చెందిన పవన్ కుమార్. ఈయన పుట్టగొడుగుల పెంపకంలో హైటెక్ పద్ధతులను పాటించి, గణనీయమైన ఉత్పత్తి సాధించాడు.

Success story: బతుకు మార్చిన పుట్టగొడుగులు.. ఈ రైతు అందరికీ రోల్ మోడల్..
Mushroom Farming
Follow us
Madhu

|

Updated on: May 16, 2024 | 3:29 PM

పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. ఎంచుకున్న రంగంలో విజయం సాధించి, అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు. ఇలాగే కష్టపడి పనిచేసి ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందుకు సాగిన అనేక మంది మనకు స్ఫూర్తిదాయకం నిలుస్తున్నారు. వారి జీవితాలను, విజయాలను తెలుసుకుంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాంటి వారే నైరుతి ఢిల్లీలోని హసన్ పూర్ గ్రామానికి చెందిన పవన్ కుమార్. ఈయన పుట్టగొడుగుల పెంపకంలో హైటెక్ పద్ధతులను పాటించి, గణనీయమైన ఉత్పత్తి సాధించాడు. వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు.

శాస్త్రవేత్తల సలహా..

పవన్ కుమార్ తన పొలంలో గోధుమలు, ఆవాలు పండించేవాడు. వాటిని సాగు చేయడానికి చాలా కష్టపడేవాడు. కానీ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంతో దిగుబడి నామమాత్రంగా వచ్చేది. ఆదాయం కూడా సరిపోయేది కాదు. దీంతో పవన్ కుమార్ ఢిల్లీలోని ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలను కలిశాడు. వారి సలహా మేరకు పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇది తన వ్యవసాయానికి అనుబంధంగా ఉండడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుందని నమ్మాడు.

శిక్షణతో సాగుపై అవగాహన..

ముందుగా 2016లో ఐసీఏఆర్ కేవీకే క్యాంపస్‌లో జరిగిన పుట్టగొడుగుల పెంపకంపై వృత్తి శిక్షణకు కుమార్ హాజరయ్యాడు. అతడికి ఐసీఏఆర్ కేవీకే శాస్త్రవేత్తలు అవసమైన సలహాలు అందించారు. శిక్షణ పూర్తయిన తర్వాత 700 చదరపు అడుగులలో బటన్ మష్రూమ్ ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించాడు. ఉష్ణోగ్రత, తేమ నియంత్రణ, కంపోస్ట్ తయారీ, కేసింగ్, పికింగ్ తదితర వాటి నిర్వహణకు సాంకేతిక పద్ధతులు అవలంబించాడు. పుట్టగొడుగుల పెంపకం సామర్థ్యాన్నిమరింత పెంచడానికి సోలన్ అనే శాస్తవేత్తను కలిశాడు. అనంతరం తన హైటెక్ మష్రూమ్ యూనిట్‌ను 2022-23లో విస్తరించాడు.

మంచి ఆదాయం..

పవన్ కుమార్ మొదట్లో స్థానిక మార్కెట్‌కు మాష్రూమ్స్ సరఫరా చేసేవాడు. అనంతరం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని రెస్టారెంట్లు, మాల్స్‌కు విక్రయించడం ప్రారంభించాడు. ఆదాయం బాగా వస్తుండడంతో కష్టబడి పనిచేశాడు. అలాగే వినియోగదారులకు కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం బుకింగ్ పోర్టల్‌ను ప్రారంభించాడు.

అంచలంచెలుగా..

కుమార్ 2016 నవంబర్ లో తన పుట్టగొడుగుల పెంపకం యూనిట్‌ను ప్రారంభించాడు. 2017లో ఫిబ్రవరిలో పుట్టగొడుగులను కోయడం ప్రారంభించాడు. యూనిట్ ను 900 చదరపు అడుగుల నుంచి 5000 చదరపు అడుగులకు విస్తరించాడు. న్యూ ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో ఉండే రెస్టారెంట్లు, మాల్స్‌కు పుట్టగొడుగులను విక్రయించడం ప్రారంభించాడు.

ఏడాదికి రూ.21.60 లక్షల ఆదాయం..

ప్రస్తుతం కిలో పుట్టగొడుగుల ధర రూ. 100 నుంచి 120 వరకూ ఉంది. ఆఫ్ సీజన్ లో రూ.160 నుంచి రూ.180 వరకూ పలుకుతున్నాయి. పవన్ కుమార్ తన యూనిట్ నుంచి దాదాపు 54 వేల కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తూ ఏడాదికి రూ.21,60,000 నికర ఆదాయం ఆర్జిస్తున్నాడు.

రైతులకు రోల్ మోడల్..

పుట్టగొడుగుల పెంపకంలో సాధించి విజయంతో దేశంలో అందరికీ పవన్ కుమార్ సుపరిచితుడయ్యాడు. వాటిని సాగుచేసే వారికి ఆదర్శంగా నిలిచాడు. అధిక నాణ్యత పుట్టగొడుగులను అందుబాటులోకి తీసుకువచ్చాడు. బటన్ మష్రూమ్‌లలో అత్యాధునిక సాంకేతికతలను అవలంబించేలా మిగిలిన రైతులను ప్రోత్సహిస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న వారు తరచూ అతడి యూనిట్‌ను సందర్శింటారు. ఎన్ సీటీ ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్‌లలో రైతులందరికీ రోల్ మోడల్‌గా మారాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..