Credit Card Rules: ఆ రెండు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ లావాదేవీలపై అదనపు ప్రయోజనాలు

చాలా బ్యాంకులు తమ వినియోగదారులకు అర్హతను బట్టి క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడికి రెండు నుంచి మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉంటున్నాయంటే వీటి వినియోగం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బ్యాంకులు మారుతున్న రూల్స్ ప్రకారం ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ రూల్స్ కూడా మారుస్తాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా నియో ఇన్ఫినిటీ, టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌ రూల్స్ తాజాగా మార్చాయి. ఈ నయా రూల్స్ ఆగస్ట్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

Credit Card Rules: ఆ రెండు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ లావాదేవీలపై అదనపు ప్రయోజనాలు
Credit Card
Follow us

|

Updated on: Jun 27, 2024 | 4:20 PM

భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు కారణంగా రోజురోజుకూ క్రెడిట్ కార్డుల వినియోగదారులు  బాగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ వినియోగదారులకు అర్హతను బట్టి క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడికి రెండు నుంచి మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉంటున్నాయంటే వీటి వినియోగం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బ్యాంకులు మారుతున్న రూల్స్ ప్రకారం ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ రూల్స్ కూడా మారుస్తాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా నియో ఇన్ఫినిటీ, టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌ రూల్స్ తాజాగా మార్చాయి. ఈ నయా రూల్స్ ఆగస్ట్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ముఖ్యంగా  యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపుల కోసం ఈ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్ స్ట్రక్చర్‌లో సర్దుబాట్లను చేశారు. ఇదే విషయాన్ని ఈ-మెయిల్ నోటిఫికేషన్‌ల ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా నియో క్రెడిట్ కార్డుల నూతన నియమాల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

వినియోగదారులు టాటా నియో యూపీఐ ఐడీను ఉపయోగించి చేసిన అర్హత ఉన్న లావాదేవీలపై 1.5 శాతం నియో కాయిన్స్‌ను రివార్డ్‌లుగా అందుకుంటారు. పేటీఎం, ఫోన్ పే, క్రెడ్ వంటి ఇతర అర్హత ఉన్న యూపీఐ ఐడీల IDల ద్వారా చేసే లావాదేవీలు 0.50 శాతం నియో కాయిన్స్‌ను  పొందవచ్చు. అదేవిధంగా టాటా నియో ప్లస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు టాటా నియో యూపీఐ ఐడీను ఉపయోగించి అర్హత ఉన్న యూపీఐ లావాదేవీలపై 1 శాతం నియో కాయిన్స్, ఇతర అర్హత కలిగిన యూపీఐ ఐడీలను ఉపయోగించే లావాదేవీలపై 0.25 శాతం నియో కాయిన్స్‌ను పొందవచ్చు. ఈ మార్పులు కాకుండా టాటా నియో ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంది. వినియోగదారులు టాటా నియో యాప్ ద్వారా ఈఎంఐయేతర ఖర్చుల కోసం 10 శాతం నియో కాయిన్స్‌ను సంపాదించవచ్చు.

అయితే భాగస్వామి టాటా బ్రాండ్‌లలో ఖర్చు చేస్తే 5 శాతం నియో కాయిన్స్ లభిస్తాయి. నాన్-టాటా బ్రాండ్ ఖర్చులు లేదా వ్యాపారి ఈఎంఐ ఖర్చులు 1.5 శాతం నియో కాయిన్స్‌తో రివార్డ్ వస్తాయి. అలాగే టాటా నియో ప్లస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు టాటా న్యూ యాప్ ద్వారా ఈఎంఐ కాని ఖర్చులకు 7 శాతం నియో కాయిన్స్, భాగస్వామి టాటా బ్రాండ్‌లలో ఖర్చు చేసినందుకు 2 శాతం నియో కాయిన్స్‌ను అందిస్తుంది. టాటా నియో యాప్ ద్వారా రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు కూడా 2 శాతం నియో కాయిన్స్‌ను పొందుతాయి. రుసుములకు సంబంధించి టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో చేరడం/పునరుద్ధరణ రుసుము రూ.1,499, వార్షికంగా రూ.3 లక్షలు ఖర్చు చేయడంపై వార్షిక రుసుము మినహాయింపు ఉంటుంది. మరోవైపు టాటా నియో ప్లస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో చేరడం/పునరుద్ధరణ రుసుము రూ.499. అయితే వార్షికంగా రూ. లక్ష ఖర్చు చేస్తే వార్షిక రుసుము మినహాయింపు లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..