PM Kissan Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్..
పీఎం కిసాన్ పథకంలో భాగంగా భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్, డిసెంబర్ 2023 మధ్య విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే రైతులకు వ్యవసాయ పెట్టుబడి కేంద్ర చేసే సాయం దీన్ని విడతలు వారీగా చేస్తారు. ఈ పథకం యొక్క 14వ విడతను జూలై 27, 2023న కేంద్రం విడుదల చేసింది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్, డిసెంబర్ 2023 మధ్య విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కేంద్రం నుండి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి పీఎం కిసాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పీఎం కిసాన్ అంటే
వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ ఇన్‌పుట్‌లను సేకరించేందుకు వారి ఆర్థిక అవసరాలను పరిష్కరించడానికి దేశంలోని అన్ని భూస్వామ్య రైతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా ఆదాయ మద్దతును అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా లక్షిత లబ్ధిదారులకు ప్రయోజనం బదిలీకి సంబంధించిన మొత్తం ఆర్థిక బాధ్యత ప్రభుత్వమే భరిస్తుంది.
అర్హతలివే
భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు, ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. చివరిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 27న పీఎం కిసాన్ పథకం కింద సుమారు 85 మిలియన్ల మంది రైతు లబ్ధిదారులకు 14వ విడతగా సుమారు రూ.17,000 కోట్లు విడుదల చేశారు. దీంతో పథకం ప్రారంభం నుంచి లబ్ధిదారులకు బదిలీ చేసిన మొత్తం ఇప్పుడు రూ.2.59 లక్షల కోట్లకు చేరుకుంది.
పీఎం కిసాన్ ప్రారంభం ఇలా
పీఎం కిసాన్ పథకం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా రైతులకు రూ. 2.42 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందారు.
దరఖాస్తు ఇలా
- ముందుగా మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- అక్కడ ఫార్మర్ సర్వీస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కొత్త రైతు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా నింపాలి.
- అనంతరం మీరు వివరాలను నమోదు చేసి ‘అవును’పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2023లో అడిగిన సమాచారాన్ని పూరించాలి, దానిని సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
పీఎం కిసాన్ స్టేటస్ చెక్
- లబ్ధిదారులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి
- ఆపై మీరు హోమ్ పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంలో ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఎంపికను ఎంచుకోండి.
- అనందరం మీరు రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.
- ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి
- ఆపై చివరగా, ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి ప్రదర్శితమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి