AI Chatbot: రైతులకు ఇకపై ఏఐ ద్వారా సేవలు.. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో లాంచ్‌ చేసిన ప్రభుత్వం

పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో కూడా తాజా ఏఐ చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించారు. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. వ్యవసాయం,  రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నుంచి ఈ ఏఐ చాట్‌బాట్‌ను సేవలను పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసేవలు  ప్రధానమంత్రి-కిసాన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌తో అనుసంధానించబడిన మొట్ట మొదటి సేవలుగా పరిగణించాలి.

AI Chatbot: రైతులకు ఇకపై ఏఐ ద్వారా సేవలు.. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో లాంచ్‌ చేసిన ప్రభుత్వం
Farmer
Follow us
Srinu

|

Updated on: Sep 22, 2023 | 6:30 PM

మారుతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇటీవల స్మార్ట్‌ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కొత్త మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రజాపయోగ వెబ్‌సైట్‌లు తమ వినియోగదారులకు సేవలను అందించడానికి ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల రైతులకు సేవలను అందించే పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో కూడా తాజా ఏఐ చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించారు. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. వ్యవసాయం,  రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నుంచి ఈ ఏఐ చాట్‌బాట్‌ను సేవలను పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసేవలు  ప్రధానమంత్రి-కిసాన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌తో అనుసంధానించబడిన మొట్ట మొదటి సేవలుగా పరిగణించాలి. వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అదనపు వ్యవసాయ కార్యదర్శి ప్రమోద్ మెహెర్దా సమక్షంలో ఏఐ చాట్‌బాట్‌ను వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో నూతనంగా ప్రారంభించిన సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏఐ చాట్‌బాట్‌తో పీఎం కిసాన్‌ పథకం ఎక్కువ మందికి చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా రైతులకు వారి ప్రశ్నలకు సత్వర, స్పష్టమైన, కచ్చితమైన ప్రతిస్పందనలను అందిస్తుంది. ఈ చాట్‌బాట్‌ను ఈకేస్టెప్‌ ఫౌండేషన్, భాషిణి మద్దతుతో అభివృద్ధి చేశారు. పీఎం కిసాన్‌ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఏఐ చాట్‌బాట్ పరిచయం వినియోగదారులకు స్నేహపూర్వకంగా యాక్సెస్ చేసేలా రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించారు. నూతన ఏఐ చాట్‌బాట్ రైతులకు వారి అప్లికేషన్ స్థితి, చెల్లింపు వివరాలు, అనర్హత స్థితి, ఇతర స్కీమ్-సంబంధిత అప్‌డేట్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెతకడంలో సహాయం చేస్తుంది.

మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారానే 

పీఎం కిసాన్‌ మొబైల్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయగలిగేలా ఏఐ చాట్‌బాట్ సమగ్రపరిచారు. పీఎం కిసాన్‌ లబ్ధిదారుల భాషా, ప్రాంతీయ వైవిధ్యాన్ని అందించడం ద్వారా బహుభాషా మద్దతును అందిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ ఏకీకరణ పారదర్శకతను పెంపొందించడమే కాకుండా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా రైతులకు మద్దతునిస్తుంది. అయితే ఈ  చాట్‌బాట్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఒడియా, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశంలోని మొత్తం 22 అధికారిక భాషలలో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి