Budget 2024: ఉద్యోగులకు కేంద్రం వరాలు.. జీతంలో 50శాతం వరకూ పెన్షన్‌కు అవకాశం!

అనేక మంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు తమ అంచనాలను, సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కొన్ని ఆన్ లైన్ నివేదికల్లో దీనికి గురించి వివరించాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్ గా తమ జీతంలో రిటైర్ మెంట్ కు ముందు చివరిసారిగా ఎంత తీసుకున్నారో దానిలో 50శాతం పెన్షన్ గా అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Budget 2024: ఉద్యోగులకు కేంద్రం వరాలు.. జీతంలో 50శాతం వరకూ పెన్షన్‌కు అవకాశం!
Union Budget 2024
Follow us

|

Updated on: Jul 10, 2024 | 2:57 PM

కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు తమ అంచనాలను, సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కొన్ని ఆన్ లైన్ నివేదికల్లో దీనికి గురించి వివరించాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్ గా తమ జీతంలో రిటైర్ మెంట్ కు ముందు చివరిసారిగా ఎంత తీసుకున్నారో దానిలో 50శాతం పెన్షన్ గా అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఈ ఎన్పీఎస్ కింద 25-30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే వారికి, ప్రత్యేకించి 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ, ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారి ఆందోళనలను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు.

సోమనాథన్ కమిటీ..

50శాతం చివరి శాలరీ అనే సరికి అందరికీ ఓపీఎస్ గుర్తుకొచ్చి ఉంటుంది. అయితే ఓపీఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కి తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసాను అందించే అవకాశాన్ని పరిశీలించింది. అలాగే ప్రపంచ పద్ధతులను సమీక్షించింది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసింది. హామీ ఇవ్వబడిన రిటర్న్‌ల ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత, 25-30 ఏళ్లలోపు సేవలందించే ఉద్యోగులకు.. వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50 శాతానికి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది. అదనంగా, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మరో నివేదిక పేర్కొంది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించింది.

ఓపీఎస్‌కి ఎన్పీఎస్‌కి తేడా..

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ చివరిగా తీసుకున్న జీతంలో సగం జీవితకాల పెన్షన్‌గా పొందవచ్చు. పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ మొత్తం సర్దుబాటులకు లోబడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పదేళ్ల సర్వీసును పూర్తి చేసినట్లయితే, పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌ను పొందేలా ఓపీఎస్ అవకాశం కల్పిస్తుంది. ఈ పెన్షన్ మొత్తం వారి చివరిగా డ్రా చేసిన ప్రాథమిక జీతం, సర్వీస్‌లో ఉన్న మొత్తం సంవత్సరాల ఆధారంగా లెక్కించబడుతుంది. అలాగే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం పెన్షన్ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అంటే వారి సర్వీస్ సంవత్సరాలలో, ఉద్యోగుల జీతంలో ఏ భాగాన్ని వారి పెన్షన్ ఫండ్‌కు తీసివేయరు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని అందిస్తుంది. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ ఈ ఓపీఎస్ కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉద్యోగులు కంట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద, ప్రభుత్వ ఉద్యోగులు వారి ప్రాథమిక వేతనంలో 10%, కేంద్రం 14% కంట్రీబ్యూట్ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..