AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Tag Air: మీ వస్తువులకు కొత్త బాడీగార్డ్.. ఎక్కడ మిస్ అయినా.. ఇట్టే పట్టేస్తుంది..

మన అవసరాలను బట్టి ప్రస్తుతం వివిధ కంపెనీల ట్రాకింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దానిలో భాగంగా రిలయన్స్ జియో కంపెనీ జియోట్యాగ్ ఎయిర్ అనే కొత్త ట్రాకింగ్ పరికరాన్ని విడుదల చేసింది. గతేడాది విడుదలైన జియో ట్యాగ్ కు ఇది కొనసాగింపు అని చెప్పవచ్చు. అయితే జియో ట్యాగ్ కేవలం జియో థింగ్స్ యాప్ తో మాత్రమే పనిచేస్తుంది.

Jio Tag Air: మీ వస్తువులకు కొత్త బాడీగార్డ్.. ఎక్కడ మిస్ అయినా.. ఇట్టే పట్టేస్తుంది..
Jio Tag Air
Madhu
|

Updated on: Jul 10, 2024 | 3:24 PM

Share

ప్రతి రోజూ నిద్ర లేచింది మొదలు మళ్లీ పడుకునే వరకూ మనిషి కాలంతో పరుగులు తీస్తున్నాడు. పనులన్నీ నిమిషాల వ్యవధిలో పూర్తవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నాడు. దీంతో సహజంగానే ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఈ కంగారులో తనకు అవసరమైన వస్తువులను ఎక్కడ పెట్టాడో మరిచిపోతున్నాడు. పెరుగుతున్న టెక్నాలజీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది. ముఖ్యమైన వస్తువులను ఎక్కడైనా మర్చిపోతే, వాటిని గుర్తించే అవకాశం కల్పిస్తోంది.

ట్రాకింగ్ పరికరం..

మన అవసరాలను బట్టి ప్రస్తుతం వివిధ కంపెనీల ట్రాకింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దానిలో భాగంగా రిలయన్స్ జియో కంపెనీ జియోట్యాగ్ ఎయిర్ అనే కొత్త ట్రాకింగ్ పరికరాన్ని విడుదల చేసింది. గతేడాది విడుదలైన జియో ట్యాగ్ కు ఇది కొనసాగింపు అని చెప్పవచ్చు. అయితే జియో ట్యాగ్ కేవలం జియో థింగ్స్ యాప్ తో మాత్రమే పనిచేస్తుంది. కానీ కొత్త జియోట్యాగ్ ఎయిర్ మాత్రం ఆ యాప్‌తో పాటు ఆపిల్ ఫైండ్ మై ఫీచర్ కు కూడా అనుకూలంగా ఉంటుంది.

ప్రత్యేకతలు..

జియో ట్యాగ్ ఎయిర్ (Jio Tag Air)కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మీ వస్తువులు ఎక్కడున్నా సులభంగా గుర్తిస్తుంది. ముఖ్యమైన తాళాలు, గుర్తింపు కార్డులు, వ్యాలెట్లు, పర్సులు, లగేజీ, పెంపుడు జంతువులు, ఇతర ముఖ్యమైన వస్తువులను కాపాడుతుంది. ఈ డివైజ్ ద్వారా వాటిని గుర్తించవచ్చు. తద్వారా మీ విలువైన సమయం ఆదా అవుతుంది.

వస్తువులు ఎక్కడున్నా..

జియో ట్యాగ్ ఎయిర్ ట్రాకర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ పరికరాలతో పనిచేస్తుంది. ముఖ్యంగా ఐఓఎస్ 14, అంతకంటే మెరుగైన ఐఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ 9, ఆ పైన వెర్షన్‌లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వైర్ లెస్ ట్రాకింగ్ పరికరంలో 5.3 వెర్షన్ బ్లూటూత్ అమర్చారు. దీని లోపల ఒక స్పీకర్ ఉంటుంది. పొగొట్టుకున్న, మరిచిపోయిన వస్తువులను గుర్తించే సమయంలో 90-120 డీబీ సౌండ్‌ బయటకు వస్తుంది. యాపిల్ ఫైండ్ మై నెట్ వర్క్, జియో థింగ్స్ యాప్ రెండింటితోనూ పనిచేయడం ఈ ట్రాకింగ్ పరికరం మరో ప్రత్యేకత. అయితే వీటిలో ఒకదానిని మాత్రమే వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి.

నిరంతర పర్యవేక్షణ..

ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారు జియో థింగ్స్ యాప్ తో ఈ డివైస్ ను జత చేసుకోవాలి. దానిలోనే ట్యాగ్ చేసిన ప్రతి అంశాన్ని పరిశీలించే వీలుంటుంది. ఒక ఆపిల్ వినియోగదారులు ఆపిల్ ఫైండ్ మై యాప్ తో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు జియో ట్యాగ్ ఎయిర్ ట్రాకర్ నుంచి నిరంతరం బ్లూటూత్ సిగ్నల్స్ వస్తాయి. వీటి ద్వారా మన వస్తువులు ఎక్కడి ఉన్నాయో గుర్తించే అవకాశం ఉంటుంది.

ధర వివరాలు..

ఎన్నో ఉపయోగాలు కలిగిన జియో ట్యాగ్ ఎయిర్ ట్రాకింగ్ డివైస్ ధర సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉంది. జియో కంపెనీ తన వెబ్ సైట్ లో దీని ధర రూ. 2,999గా అని చెప్పింది. అయితే దీనిని రూ.1,499 వద్ద కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. బ్లూ, రెడ్, గ్రే రంగులలో డివైజ్ అందుబాటులో ఉంది. సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ ఆఫర్లు, పేటీఎం, క్రెడ్ యూపీఏ తదితర వాటిని ఉపయోగించి క్యాష్‌బ్యాక్‌లను కూడా పొందే అవకాశం ఉంది. అలాగే జియో మార్ట్, రిలయర్స్ డిజిటల్, అమెజాన్ లలో కూడా ఈ పరికరాన్ని కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..