PAN Card: పిల్లలకూ పాన్ కార్డు ఉంటుందా? ఎలా దరఖాస్తు చేయాలి?

వాస్తవానికి పెద్దలకే కాదు.. 18 ఏళ్ల లోపు మైనర్లు కూడా పాన్ కార్డు పొందవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే కార్డు అవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంటే.. లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మీ బిడ్డను నామినీగా చేస్తుంటే.. మీ పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచేటప్పుడు.. మైనర్‌కు ఏదైనా ఆదాయ వనరు ఉన్న సందర్భాల్లో పాన్ కార్డు అవసరం అవుతుంది.

PAN Card: పిల్లలకూ పాన్ కార్డు ఉంటుందా? ఎలా దరఖాస్తు చేయాలి?
Pan Card
Follow us

|

Updated on: Jul 10, 2024 | 3:55 PM

మన దేశంలో ముఖ్యమైన రుజువుల్లో ఆధార్ కార్డుతో పాన్ కార్డు కూడా ప్రధానమైనది. ఆధార్ కార్డు మన దేశ పౌరుడిగా గుర్తింపునిస్తే.. పాన్ కార్డు ఇక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏది చేయాలన్నా ఈ పాన్ కార్డు ఉండాల్సిందే. పాన్ కార్డు అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్. కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా ఈ పాన్ నంబర్ ఉండాల్సిందే. సాధారణంగా దీనిని ఎక్కువగా ఆదాయపు పన్నును ఫైల్ చేయడానికి అవసరమైన పత్రంగా లేదా కస్టమర్ (కేవైసీ) ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి అవసరమైన రుజువుగా ఉపయోగిస్తంటారు. వీలైంత వరకూ మేజర్లు అంటే 18ఏళ్లు పైబడిన వారికే ఎక్కువ అవసరం అవుతుంది. మరి మైనర్లు అంటే చిన్న పిల్లలకు పాన్ కార్డు అవసరం ఉంటుందా? ఉంటే వారికి ప్రత్యేకంగా కార్డులు ఉంటాయా? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అది ఎక్కడ ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..

పిల్లలకీ పాన్ కార్డు..

వాస్తవానికి పెద్దలకే కాదు.. 18 ఏళ్ల లోపు మైనర్లు కూడా పాన్ కార్డు పొందవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే కార్డు అవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంటే.. లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మీ బిడ్డను నామినీగా చేస్తుంటే.. మీ పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచేటప్పుడు.. మైనర్‌కు ఏదైనా ఆదాయ వనరు ఉన్న సందర్భాల్లో పాన్ కార్డు అవసరం అవుతుంది. దరఖాస్తును వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చేయాలి.

ఆన్ లైన్లో ఇలా దరఖాస్తు చేయాలి..

  • ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్‌ని సందర్శించి, ఫారమ్ 49A డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫారమ్ ని పూరించండి, సూచనలను జాగ్రత్తగా చదవండి. సరైన వర్గాన్ని ఎంచుకోవడం ద్వారా మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని పూరించండి.
  • పిల్లల వయస్సు సర్టిఫికెట్, అవసరమైన పత్రాలు, తల్లిదండ్రుల ఫొటోను అప్‌లోడ్ చేయండి.
  • తల్లిదండ్రుల సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. రుసుము రూ. 107 చెల్లించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఫారమ్‌ను సమర్పించి, రసీదు సంఖ్యను నోట్ చేసుకోండి.
  • వెరిఫై అయిన తర్వాత, మీరు 15 రోజులలోపు పాన్ కార్డ్‌ని అందుకుంటారు.

ఆఫ్‌లైన్ అప్లికేషన్..

అధికారిక వెబ్‌సైట్ లేదా ఎన్ఎస్డీఎల్ కార్యాలయం నుంచి ఫారమ్ 49A పొందండి. ఫారమ్‌ను పూర్తి చేయండి. పిల్లల రెండు ఫోటోగ్రాఫ్‌లు, అవసరమైన పత్రాలను జత చేయండి. పూర్తి చేసిన ఫారమ్, పత్రాలను రుసుముతో పాటు సమీపంలోని ఎన్ఎస్డీఎల్ కార్యాలయానికి సమర్పించండి. వెరిఫికేషన్ తర్వాత, అందించిన చిరునామాకు పాన్ కార్డ్ వస్తుంది.

అవసరమైన పత్రాలు..

దరఖాస్తు చేస్తున్న మైనర్ కు చెందిన తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు రుజువు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ కార్డ్ వీటిల్లో ఏదైనా సమర్పించవచ్చు. చిరునామా రుజువుగా ఆధార్ కార్డ్, పోస్టాఫీసు పాస్‌బుక్, ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు.

18 ఏళ్ల వయస్సులో.. 18 ఏళ్లు నిండిన తర్వాత, మైనర్‌లకు జారీ చేసిన పాన్ కార్డ్‌లో వారి ఫొటో లేదా సంతకం లేనందున, అది గుర్తింపు రుజువుగా సరిపోదు. కాబట్టి వ్యక్తులు తప్పనిసరిగా వారి పాన్ కార్డ్‌కి అప్‌డేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..