ITR Filing: ఐటీ రీఫండ్ ఇంకా జమ కాలేదా? కారణమిదేనేమో! వెంటనే చెక్ చేసుకోండి..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్)ను ఫైలింగ్ చేసిన తర్వాత తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తుంటారు. మీ ఐటీఆర్ ప్రాసెస్ చేశాక.. దానిని ధ్రువీకరించిన తర్వాత మాత్రమే రీఫండ్ జారీ అవుతుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు అధికంగా పన్నులు చెల్లిస్తే, ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ITR Filing: ఐటీ రీఫండ్ ఇంకా జమ కాలేదా? కారణమిదేనేమో! వెంటనే చెక్ చేసుకోండి..
Income Tax
Follow us

|

Updated on: Jul 10, 2024 | 4:22 PM

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్)ను ఫైలింగ్ చేసిన తర్వాత తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తుంటారు. మీ ఐటీఆర్ ప్రాసెస్ చేశాక.. దానిని ధ్రువీకరించిన తర్వాత మాత్రమే రీఫండ్ జారీ అవుతుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు అధికంగా పన్నులు చెల్లిస్తే, ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 వరకు మాత్రమే గడువు ఉంది.

ఎస్బీఐ ఆధ్వర్యంలో..

మీ ఆదాయపు పన్ను రీఫండ్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రాసెస్ చేస్తుంది. ఐటీఆర్ లో మీరు నమోదు చేసిన బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. కాబట్టి సరైన బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ నంబర్ వేయడం చాలా అవసరం. ప్రభుత్వ కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో బ్యాంక్ ఖాతాను ముందస్తుగా ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాతో పాన్‌ కార్డును కూడా లింక్ చేసుకోవాలి.

స్టేటస్ చెక్ చేసుకోవాలంటే..

మీ ఆదాయపు పన్ను రిఫండ్ స్థితిని పరిశీలించుకోవడం చాలా అవసరం. దానికి సులువైన పద్ధతులు ఉన్నాయి. ఇ-ఫైలింగ్ పన్ను పోర్టల్‌లో ఆదాయపు పన్ను వాపసు స్థితిని ఇలా తనిఖీ చేసుకోవచ్చు.

  • పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో కి వెళ్లి పాన్ / ఆధార్ నంబర్‌ను ఐడీగా నమోదు చేసి, మీ పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • ఈ-ఫైల్ అనే ఎంపికపై క్లిక్ చేయండి. దానిలో ఆదాయ పన్ను రిటర్న్‌లు ఎంచుకోండి. అనంతరం ‘వ్యూ ఫిల్డ్ రిటర్న్స్’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • తాజా ఐటీఆర్ ను తనిఖీ చేయండి. అనంతరం వ్యూ డిటైల్స్ లోకి వెళ్లండి. అక్కడ మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ స్టేటస్ కనిపిస్తుంది. దానిలో ఇది మీకు పన్ను రీఫండ్ జారీ చేసిన తేదీ, మొత్తం తదితర వివరాలు ఉంటాయి.

ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్‌లో..

ఆదాయపు పన్ను వాపసును ఎన్ఎస్ డీఎల్ వెబ్‌సైట్‌లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. అసెస్సింగ్ ఆఫీసర్ బ్యాంకర్‌కు రీఫండ్ పంపిన 10 రోజుల తర్వాత మాత్రమే దీనిలో స్టేటస్ తెలుస్తుంది.

  • ఎన్ఎస్డీఎల్ అధికారిక వెబ్ సైట్లోకి  వెళ్లండి.
  • మీ పాన్ వివరాలను నమోదు చేయండి
  • మీరు వాపసు స్థితిని తనిఖీ చేయాలనుకుంటున్న సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి. వెంటనే మీ రీఫండ్ స్థితి కనిపిస్తుంది.

రీఫండ్ రాకపోవడానికి కారణాలివే..

  • ఐటీఆర్ సమర్పించిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల రీఫండ్ రాకపోవచ్చు.
  • మీ పాన్ పనిచేయకపోతే మీ వాపసు విఫలమవుతుంది. అలాగే మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని మెసేజ్ కనిపిస్తుంది.
  • బ్యాంక్ ఖాతాను ముందుగా ధ్రువీకరించకపోయినా రీఫండ్ రాదు.
  • బ్యాంక్ ఖాతాలో తెలిపిన పేరు, పాన్ కార్డ్ వివరాలతో సరిపోకపోయినా రాదు.
  • బ్యాంకు ఐఎఫ్ఎస్ సీ కోడ్ సక్రమంగా లేకపోయినా ఇబ్బంది ఎదురవుతుంది.
  • ఐటీఆర్‌లో పేర్కొన్న ఖాతా మూసివేసినా రీఫండ్ జమ కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..