చలికాలం కదా అని కారులో హీటర్ వాడుతున్నారా? అయితే మీరు చాలా డేంజర్‌లో ఉన్నట్లే!
మెల్లమెల్లగా చలి పెరుగుతున్న వేళ, చాలా మంది కారు హీటర్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రాణాంతక ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూసి ఉన్న ప్రదేశాల్లో, దీర్ఘకాలం హీటర్ వాడటం కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగానికి, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది.

మెల్లమెల్లగా చలి పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే చలి వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు బయటకు రావాలంటేనే వామ్మో అంటున్నారు. సాయంత్రం అయితే చాలు త్వరగా ఇళ్లకు చేరిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. బైకులపై ప్రయాణించేవారు స్వెటర్లు వేసుకొని తిరుగుతుంటే.. కారులో వెళ్లేవారిలో కొంతమంది ఎయిర్ హీటర్‌ను ఉపయోగిస్తున్నారు. కేవలం చలి నుంచి ఉపశమన కోసమే కాకుండా ఉదయం వేళల్లో కారు గ్లాస్‌పై మంచు మబ్బుగా మారినప్పుడు సైతం ఈ హీటర్‌ను వాడతారు.
ప్రమాదకరం..
అయితే ఇలా ఎయిర్ హీటర్ అతిగా యూజ్ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. కొంతమంది కారులో ఎయిర్ హీటర్‌ను ఆన్ చేసి అలాగే కారులో నిద్రలోకి జారుకుంటారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. కారు ఇంజిన్ పని చేస్తున్నప్పుడు వేడి వెలువడుతుందని, దాన్ని తగ్గించేందుకు కూలెంట్ పని చేస్తుంది, ఆ కూలెంట్ నుంచి హీటర్ వేడిని గ్రహిస్తుంది.
ఇలా హీటర్ వేసుకొని కారులో నిద్రపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఓఆర్‌ఆర్‌పై శామీర్‌పేట్ కీసర రోడ్డులో తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. కొంతసేపటికి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు.
- చలికాలంలో ఎయిర్ హీటర్ ఉపయోగించే వారు ముందుగానే ఇంజిన్ లీకేజీ, వైరింగ్‌ని చెక్ చేయించుకోవాలి.
- మూసి ఉంచిన స్థలంలో, గ్యారేజీ లాంటి ప్రదేశాల్లో కారులో హీటర్‌ను వాడకపోవడమే మంచిది.
- కారులో హీటర్ 22 డిగ్రీలలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే వాడాలి.
- దీన్ని తరచుగా ఉపయోగించడం వల్ల తలనొప్పి, వాంతులకు దారి తీస్తుంది.
- కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశాలుంటాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




