8th Pay Commission: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..? ఎనిమిదో వేతన కమిషన్‌పై కీలక ప్రకటన..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రాథమిక వేతనాలు, అలవెన్సులు, పెన్షన్, ఇతర ప్రయోజనాలను సవరించడానికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య సెక్రటరీ జనరల్ భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ ఎస్‌బీ యాదవ్‌కు ఇటీవల రాసిన లేఖలో 8వ వేతన సంఘం ఏర్పాటుతో పాటు పాత పెన్షన్ స్కీమ్‌ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉద్యోగులు, పింఛనుదారులకు ఆపేసిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ అందజేయాలని కోరారు.

కేంద్రంలో ఎన్‌డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రకటనలపై వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రాథమిక వేతనాలు, అలవెన్సులు, పెన్షన్, ఇతర ప్రయోజనాలను సవరించడానికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య సెక్రటరీ జనరల్ భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ ఎస్‌బీ యాదవ్‌కు ఇటీవల రాసిన లేఖలో 8వ వేతన సంఘం ఏర్పాటుతో పాటు పాత పెన్షన్ స్కీమ్‌ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉద్యోగులు, పింఛనుదారులకు ఆపేసిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ అందజేయాలని కోరారు. అయితే ఈ బడ్జెట్‌లో ఉద్యోగులను డిమాండ్లకు అనుగుణంగా కేంద్ర ఎనిమిదో వేతన సంఘ ఏర్పాటుపై కీలక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలవెన్సులు, ప్రయోజనాలను సమీక్షించడానికి, సిఫార్సు చేయడానికి ప్రతి పదేళ్లకు ఒకసారి సెంట్రల్ పే కమిషన్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ సిఫార్సులు ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి వేతన పెంపుపై సూచనలిస్తుంది. ఏడో వేతన సంఘాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేశారు. ఇది నవంబర్ 19, 2015న తన నివేదికను సమర్పించగా ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పద్ధతిని అనుసరించి తదుపరి పే కమీషన్ – 8వ సెంట్రల్ పే కమిషన్ సాధారణంగా జనవరి 1, 2026 నుండి అమలు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కోసం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటును ప్రకటిస్తుందా? అనే ప్రశ్నకు నిపుణులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, యూనియన్లు జనవరి 2026లో 8వ వేతన సంఘం కోసం గట్టిగా వాదిస్తున్నప్పటికీ రాబోయే బడ్జెట్‌లో అధికారిక ప్రకటన కొంచెం అసంభవం అనిపిస్తుందని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని, ఉద్యోగులకు వేతన సంఘం అమలు గురించి చేసే ప్రకటన ఇచ్చానా..ఇవ్వకపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..