Budget 2024: బడ్జెట్‌పైనే ఆ రంగాల ఆశలన్నీ.. విమాన, రైలు టిక్కెట్లు తగ్గనున్నాయా..?
కేంద్రం 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ట్రావెల్, హోటల్స్ రంగం వారు బడ్జెట్‌లో తమ రంగానికి ఏదైనా ప్రయోజనాలను ప్రకటిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అలాగే పర్యాటక రంగ నిపుణులు కూడా తమకు అందించే ప్రోత్సాహం గురించి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపులను ప్రకటిస్తే తమ రంగాలకు ఊపిరి పోసినట్టేనని ఆయా రంగాల నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ట్రావెల్, హోటల్స్ రంగం వారు బడ్జెట్‌లో తమ రంగానికి ఏదైనా ప్రయోజనాలను ప్రకటిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అలాగే పర్యాటక రంగ నిపుణులు కూడా తమకు అందించే ప్రోత్సాహం గురించి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపులను ప్రకటిస్తే తమ రంగాలకు ఊపిరి పోసినట్టేనని ఆయా రంగాల నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రంగాలు ఎలాంటి ప్రోత్సాహాలు ఆశిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
విమానయాన పరిశ్రమ
గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్‌లో భారతదేశ భవిష్యత్ ఆశాజనకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రంగానికి మరింత మేలు చేయడానికి షెడ్యూల్డ్ ఎయిర్ ఆపరేషన్‌ల మాదిరిగానే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లకు కస్టమ్స్ మినహాయింపులను ఇవ్వాలని కోరుతున్నారు. ఏవియేషన్ కంపెనీలపై పన్నుల స్థిరీకరించడంతో పాటు విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. విమాన ఇందనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తేప్రైవేట్ జెట్, విమానయాన పరిశ్రమకు సంబంధించిన వృద్ధి మరింత వేగంగా ఉంటుందని వివరిస్తున్నారు.
హాస్పిటాలిటీ సెక్టార్
2024 బడ్జెట్ హోటల్ రూమ్ టారిఫ్‌లను ప్రభావితం చేస్తుందో? లేదో? అని హాస్పిటాలిటీ రంగం నిశితంగా వేచి చూస్తుంది.రెస్టారెంట్లు, ఆహార వ్యాపారాలకు బడ్జెట్‌లో ఏదైనా గుడ్ న్యూస్ చెబితే హోటళ్లు తమ ఖర్చులను మెరుగ్గా నిర్వహించడంలో, ధరలను స్థిరంగా ఉంచడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పర్యాటక ప్రదేశాల్లో కొత్త హోటళ్లు పెట్టడాని రుణాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోటల్ రంగానికి మౌలిక సదుపాయాల స్థితిని కోరడం మరియు అధిక ధర ఉన్న రూమ్స్‌పై వస్తు సేవల పన్ను హేతుబద్ధీకరించడం వంటి దీర్ఘకాలంలో ధరలను ప్రభావితం చేసే మార్పుల కోసం హాస్పిటాలిటీ రంగం వేచి చూస్తుంది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ
పర్యాటక రంగంలో భారతదేశం ఇటీవల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇక్క మౌలిక సదుపాయాల అభివృద్ధితో మెరుగైన కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టిని కనబరిస్తే పర్యాటక రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైర్-II, టైర్-III నగరాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుక కీలక చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. స్వదేశ్ దర్శన్, దేఖో అప్నా దేశ్ వంటి కార్యక్రమాలు కూడా దేశీయ ప్రయాణాల పెరుగుదలకు మద్దతునిచ్చాయని ఈ తరహా సరికొత్త ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..