Virtual Gold: పెట్టుబడి దారులకు గోల్డెన్ చాన్స్.. వర్చువల్ బంగారంతో ఎన్నో లాభాలు

బంగారం అంటే ఇష్టపడని వారు బహుశా ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా మన భారతీయులకు దీనిపై మక్కువ ఎక్కువ. పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్బాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాలను ధరించటానికి ఎంతో ఇష్టపడతారు. వారు పొదుపు చేసిన డబ్బులో ఎక్కువ భాగం దాన్ని కొనుగోలు చేయడానికే ఉపయోగిస్తారు. అలాగే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారికి వర్చువల్ గోల్డ్ అనే చాలా లాభదాయకంగా ఉంటుంది.

Virtual Gold: పెట్టుబడి దారులకు గోల్డెన్ చాన్స్.. వర్చువల్ బంగారంతో ఎన్నో లాభాలు
Virtual Gold
Follow us
Srinu

|

Updated on: Nov 29, 2024 | 8:08 PM

సాధారణంగా బంగారాన్ని ఆభరణాలు, నాణేల రూపంలో అందరూ కొనుగోలు చేస్తారు. వీటిని పలు సందర్బాల్లో భౌతికంగా వినియోగించుకోవడానికి వీలుంటుంది. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి వర్చువల్ గోల్ బాగుంటుంది. ఈ విధానంలో మీ చేతిలో బంగారం ఉండదు. గోల్డ్ ఈటీెెఎఫ్ లు, సావరిన్ గోల్డ్ బ్యాండ్లు (ఎస్ జీబీలు), డిజిటల్ గోల్డ్ తదితర రూపాలలో దాచుకోవచ్చు. మీ పెట్టుబడి వాటిలో నిల్వ చేయబడుతుంది. మార్కెట్ లో బంగారం ధరలకు అనుగుణంగానే వీటి ధరలు పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా బంగారు ఆభరణాలు కొనాలంటే తక్కువలో తక్కువ సుమారు రూ.20 వేలు ఖర్చుపెట్టాలి. కానీ వర్చువల్ గోల్డ్ ను రూ.వందతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఆ రోజు బంగారానికి ఉన్న ధర ప్రకారం.. మీ పేరు మీద జమచేస్తారు. మీ వద్ద ఉన్న డబ్బులను దానిలో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే క్రమంగా పెద్ద మొత్తంలో బంగారం పెరుగుతుంది.

వర్చువల్ విధానంలో బంగారం కొనడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టవచ్చు. భౌతికంగా బంగారం కొంటే తరుగు, మజూరి తదితర చార్జీలు ఉంటాయి. వర్చువల్ విదానంలో ఈ అదనపు ఖర్చులు ఉండవు. ఇంటిలోనే కూర్చుని మీ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. బంగారు ఆభరణాల దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వర్చువల్ విధానంలో మీ పేరు మీద బంగారం ఉంటుంది గానీ మీ ఇంటిలో ఉండదు. కాబట్టి దొంగల భయం అస్సలు ఉండదు. ఎంత బంగారం కొనుగోలు చేసినా నిశ్చింతంగా నిద్ర పోవచ్చు. దాని భద్రత, దాచుకోవడంపై భయపడాల్సిన అవసరం లేదు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు దాని డిజైన్ ఆధారంగా మేకింగ్ చార్జీలు వసూలు చేస్తారు. ఇవి బంగారం ధరకు అదనంగా ఉంటాయి. డిజిటల్ (వర్చువల్) విధానంలో అలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఆ చార్జీల సొమ్ముతో మరికొంత పరిమాణంలో బంగారం మీ పేరుపై యాడ్ అవుతుంది. దీని వల్ల డబ్బును బాగా ఆదా చేసుకోవచ్చు.

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన దుకాణానికి వెళతాం. కొత్త షాపులో కొనుగోలు చేస్తే మోసం పోతామేమోనని భయపడతాం. వర్చువల్ విధానంలో ఆ భయమే లేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేస్తాం. ఇది స్వచ్ఛత, పారదర్శకతను కచ్ఛితంగా నిర్దారణ చేస్తుంది. అలాగే భవిష్యత్తులో వర్చువల్ బంగారాన్ని భౌతికంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వర్చువల్ గోల్డ్ విధానం మంచి అవకాశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి